Solar Eclipse: ఈ సూర్యగ్రహణం చాలా రేర్.. డోన్ట్ మిస్!

Updated on: Oct 15, 2023 | 4:00 AM

సూర్యగ్రహణం రాత్రి 8 గంటల 34 నిమిషాలకు మొదలై తొలి ఝాము 2 గంటలా 25 నిమిషాలకు ముగుస్తుంది. ఈ ఏడాదిలో ఈ సూర్యగ్రహణం రెండోది, చివరిది. గతంలో కంటే ఈ గ్రహణం ఒక అరుదైన అనుభూతిని మనకు అందించబోతోంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడ్డం... ఫలితంగా సూర్యుడు ఒక అగ్ని వలయంలా కనిపించడం..!

సూర్యగ్రహణం రాత్రి 8 గంటల 34 నిమిషాలకు మొదలై తొలి ఝాము 2 గంటలా 25 నిమిషాలకు ముగుస్తుంది. ఈ ఏడాదిలో ఈ సూర్యగ్రహణం రెండోది, చివరిది. గతంలో కంటే ఈ గ్రహణం ఒక అరుదైన అనుభూతిని మనకు అందించబోతోంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడ్డం… ఫలితంగా సూర్యుడు ఒక అగ్ని వలయంలా కనిపించడం..! దీని పేరే రింగ్ ఆఫ్ ఫైర్. భూమికీ, సూర్యుడికీ మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది… ఇది ఖగోళ శాస్త్రం తేల్చిన వాస్తవం. ఈ సూర్యగ్రహణం కూడా అలానే ఏర్పడుతుంది. కానీ.. సదరు గ్రహణం కారణంగా ఏర్పడే అత్యంత అద్భుత దృశ్యం… ‘రింగ్ ఆఫ్ ఫైర్’ గురించే ఇప్పుడు అంతటా చర్చ. ఈసారి సూర్యగ్రహణం చాలా రేర్.. డోన్ట్ మిస్ అంటున్నారు అస్ట్రానమర్లు. ఎందుకంటే.. ఈ గ్రహణం సమయంలో భూమికీ, సూర్యుడికీ మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు… సూర్యుడు పరిమాణంలో మామూలు కంటే చిన్నగా కనిపిస్తాడు. ఫలితంగా.. సూర్యుడి ఉపరితల భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. మధ్యభాగం పూర్తిగా చంద్రుడితో కప్పబడి… ఆ భాగం మొత్తం ఒక నల్లటి గోళంలా కనిపిస్తుంది. చుట్టూ రగిలే అగ్నిగోళంలా మెరుస్తుంటాడు భానుడు. కానీ.. ఈ అపురూప దృశ్యాన్ని నేరుగా చూసే అదృష్టం మనకు లేదు. అమెరికా, మెక్సికో, దక్షిణ మధ్య అమెరికాలోని మరికొన్ని దేశాల్లో మాత్రమే ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. గతంలో 2012లో కనిపించిన రింగ్ ఆఫ్ ఫైర్.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సాక్షాత్కరించింది. ఇప్పుడు మిస్సయితే.. మళ్లీ 2046 వరకు అంటే… 23 ఏళ్ల వరకు ఈ దృశ్యాన్ని చూసే అవకాశం దొరకదు. ఈ అద్భుతాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది నాసా. ప్రత్యక్షంగా కాకపోయినా ఆన్‌లైన్‌లో ఈ అద్భుతాన్ని చూసే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మిగతా దేశాల్లో ఔత్సాహికులు. ఖగోళశాస్త్రం మీద ఆసక్తి ఉన్నవాళ్లకు ఇదొక అద్భుతమైన అవకాశం. సూర్య గ్రహణాన్ని చూడ్డానికే ఉత్సాహపడేవాళ్లకు ఇదొక మంచి ఛాన్స్.