గంటకు 320 కిలోమీటర్ల వేగం.. భారత్‌లో దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు

Updated on: Jul 22, 2025 | 4:08 PM

వచ్చే ఏడాది భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ ట్రయల్‌ రన్ నిర్వహించేలా వాయువేగంతో పనులు చేస్తుంది రైల్వేశాఖ. బుల్లెట్ ట్రైన్ ముంబై–అహ్మదాబాద్‌ కారిడార్‌ పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో 310 కిలోమీటర్ల వయాడక్ట్‌ల నిర్మాణం పూర్తయింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలకంగా మారిన 21 కిలోమీటర్ల అండర్ వాటర్ టన్నెల్ కూడా పూర్తి చేశారు అధికారులు.

దీంతో ఈ ప్రాజెక్టులో మేజర్ మైల్ స్టోన్ సాధించినట్లైంది. ఇక ట్రాక్ నిర్మాణం, ఎలక్ట్రికల్ వర్క్, స్టేషన్స్, బ్రిడ్జిల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తున్నారు. 15 రివర్ బ్రిడ్జిల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందన్నారు అధికారులు. మరో 4 పూర్తి దశలో ఉన్నాయని తెలిపారు. మొత్తం 12 స్టేషన్లలో 5 వూర్తి అవ్వగా.. మరో మూడు చివరి దశకు చేరుకున్నాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ దగ్గర నిర్మించే స్టేషన్ ఇంజినీరింగ్ మార్వెల్‌గా చెబుతున్నారు. భూమికి 32 మీటర్ల లోతులో ఈ స్టేషన్ నిర్మాణం ఉండబోతుందని అధికారులు చెబుతున్నారు. జపాన్ నుంచి బుల్లెట్ ట్రైన్స్ తీసుకురానుంది భారత్. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద జపాన్ భారత్‌కు రెండు షింకన్‌సెన్ రైళ్లయిన E5, E3 సిరీస్‌లను బహుమతిగా ఇవ్వనుంది. ఇవి 2026 ప్రారంభంలో డెలివరీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ రైళ్లలో అత్యాధునిక తనిఖీ వ్యవస్థలు అమర్చబడి ఉంటాయి. ఇవి ట్రాక్ స్థితి, ఉష్ణోగ్రత, దుమ్ము నిరోధకత లాంటి సమాచారాన్ని నమోదు చేస్తాయి. ఈ డేటాను భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియా కింద రూపొందించే నెక్ట్స్ జనరేషన్ ట్రైన్స్.. E10 సిరీస్ బుల్లెట్ రైళ్ల తయారీలో ఉపయోగిస్తారు. బుల్లెట్‌ రైలు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించనుంది. 508 కిలోమిటర్ల పొడవైన ఈ కారిడార్‌లో ముంబై నుండి అహ్మదాబాద్ వరకు ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ మార్గంలో థానే విరార్, వాపి, సూరత్, వడోదర వంటి నగరాలు సహా 12 స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కోసం 2016లో భారతదేశం-జపాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఆరు బుల్లెట్‌ రైళ్ల కారిడార్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది కేంద్రం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాళ్లపాక చెరువులో చెట్లు తొలగిస్తుండగా.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం