Watch Video: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. ఎలా ఎత్తుకెళ్లారో చూడండి..!

Updated on: Oct 03, 2023 | 11:11 AM

Tirupati, October 03: ఇటీవలి కాలంలో చిన్న పిల్లల కిడ్నాప్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుపతి ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో రెండేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి బాలుడు కనిపించడం లేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు అంతటా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tirupati, October 03: ఇటీవలి కాలంలో చిన్న పిల్లల కిడ్నాప్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుపతి ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో రెండేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి బాలుడు కనిపించడం లేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు అంతటా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్‌స్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతనే బాలుడిని తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా గుర్తించారు పోలీసులు. తమిళనాడుకు చెందిన కుటుంబం తమ కొడుకు అజేన్‌ మునుగన్‌తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే, అర్థరాత్రి 12 గంటలు కావడంతో బస్‌స్టాండ్‌లోనే నిద్రపోయారు. సరిగ్గా 2 గంటల సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు.