ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు

Updated on: Mar 10, 2026 | 11:01 AM

ఎండలు ముదురుతున్నాయి.. భానుడి సెగ నుంచి తప్పించుకునేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ చల్లని ఐస్‌క్రీమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, మండుతున్న ఎండలో చల్లని ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే చాలా మందికి గొంతు ఎండిపోయినట్లు అనిపించి, వెంటనే గ్లాసుడు నీళ్లు తాగేస్తుంటారు. దాహం తీర్చుకోవడానికి మీరు చేసే ఈ పని ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎండలు ముదురుతున్నాయి.. భానుడి సెగ నుంచి తప్పించుకునేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ చల్లని ఐస్‌క్రీమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, మండుతున్న ఎండలో చల్లని ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే చాలా మందికి గొంతు ఎండిపోయినట్లు అనిపించి, వెంటనే గ్లాసుడు నీళ్లు తాగేస్తుంటారు. దాహం తీర్చుకోవడానికి మీరు చేసే ఈ పని ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐస్‌క్రీమ్ ఆస్వాదించిన నిమిషాల వ్యవధిలోనే గొంతు ఎండిపోయి, గటగటా నీళ్లు తాగాలనిపించడం వెనుక ఒక సంక్లిష్టమైన శారీరక ప్రక్రియ దాగి ఉంది. దీనిని వైద్య పరిభాషలో ఒక రకమైన ‘బ్రెయిన్ ట్రాప్’ అని పిలవవచ్చు. ఐస్‌క్రీమ్‌లో ఉండే అధిక మోతాదులోని చక్కెర మరియు సోడియం (ఉప్పు) రక్తంలో కలిసినప్పుడు, అవి శరీరంలోని కణాల నుంచి నీటిని లాగేసుకుంటాయి. ఈ మార్పును గమనించిన కాలేయం వెంటనే FGF21 అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ నేరుగా మెదడులోని దాహాన్ని నియంత్రించే హైపోథాలమస్ భాగానికి చేరుకుని, శరీరానికి నీటి అవసరం ఉందనే అత్యవసర సంకేతాలను పంపిస్తుంది. దీనివల్ల మనకు విపరీతమైన దాహం వేస్తుంది. అంటే నిజానికి అది మీ శరీరానికి వెంటనే నీరు కావాలనే సంకేతం కంటే, మెదడు మిమ్మల్ని నీళ్లు తాగమని చేసే బలవంతం అన్నమాట. అయితే, ఈ ‘బ్రెయిన్ ట్రాప్’కు చిక్కకుండా, గొంతు సమస్యలు రాకుండా ఉండాలంటే ఐస్‌క్రీమ్ తిన్న కనీసం 15 నిమిషాల తర్వాతే నీళ్లు తాగడం శ్రేయస్కరం. ఇక ఐస్‌క్రీం తిన్నవెంటనే నీళ్లు తాగడం వల్ల.. ఐస్‌క్రీం చల్లదనానికి దంతాల ఎనామిల్ కుంచించుకుపోతుంది. వెంటనే నీళ్లు తాగితే ఉష్ణోగ్రతలో వచ్చే మార్పు వల్ల దంతాలు జివ్వుమని లాగడం లేదా నొప్పి పుట్టడం జరుగుతుంది. అంతేకాదు జీర్ణసమస్యలూ తలెత్తుతాయి. ఐస్‌క్రీంలోని కొవ్వు పదార్థాలు నీటితో కలిసినప్పుడు త్వరగా గడ్డకడతాయి. దీనివల్ల జీర్ణక్రియ మందగించి కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీర అంతర్గత ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా వచ్చే మార్పు వల్ల గొంతు నొప్పి, వాపు , జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఐస్‌క్రీం తిన్న తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా ఉండటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఒకవేళ దాహం ఆగకపోతే ఫ్రిజ్ నీళ్లకు బదులుగా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని కొద్దిగా తీసుకోవాలి. ఐస్‌క్రీం తిన్న తర్వాత నోటిని కేవలం పుక్కిలించడం వల్ల దంతాల సమస్యలను కొంతవరకు నివారించవచ్చు. ఏది ఏమైనా.. ఐస్‌క్రీం తిన్న వెంటనే దాహం వేసినా కొంత సమయం వరకూ నీళ్లు తాగకపోవడమే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని

వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..

టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్

అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’

Follow Us