Sri Rama Navami Shobha Yatra: శ్రీరాముని శోభాయాత్రప్రత్యక్ష ప్రసారం.. అంబరాన్నంటిన భక్తి పారవశ్యం

Updated on: Mar 27, 2026 | 4:13 PM

హైదరాబాద్‌లో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు జరిగిన శోభాయాత్రను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఎటుచూసినా కాషాయ జెండాలు, జై శ్రీరామ్ నినాదాలతో నగరం మారుమోగింది. వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య రామయ్య రథం కదలివచ్చింది. సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో 3000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక ఉత్సవం శాంతియుతంగా కొనసాగింది.

ఎటు చూసినా కాషాయ జెండాలు..! ఎక్కడ విన్నా జై శ్రీరామ్ నినాదాలు..! హైదరాబాద్‌లో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి.! సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు.. అడుగడుగునా ఆధ్యాత్మిక చైతన్యం ఉప్పెనలా సాగుతోంది. వీధుల్లో భక్తి పారవశ్యం పొంగిపొర్లుతోంది. రామనామ స్మరణ మధ్య రామయ్య రథం కదలివస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతోంది. సీతారాంబాగ్​లో శ్రీరామ శోభాయాత్రను రాష్ట్ర గవర్నర్​ శివప్రతాప్​ శుక్లా ప్రారంభించారు. సుల్తాన్​ బజార్​లోని హనుమాన్​ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాములోరి కల్యాణాలు, శోభాయాత్రలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదారాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్​ పరిధిలో 339 ప్రాంతాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. సీతారాంబాగ్​ నుంచి సాగే శ్రీరామ శోభాయాత్రకు 3000కు పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. అనుకొన్న సమయానికి శోభాయాత్ర పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. శ్రీరామ శోభాయాత్ర శాంతియుతంగా ముగిసేలా ప్రజలు సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లుగా ఆయన వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే !!

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌

Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు

ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే

ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి

Loading...
Unable to load recommendations.
Follow Us