Andhra: పెరట్లో అదేపనిగా చప్పుళ్లు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా

Updated on: Sep 30, 2025 | 8:31 AM

పోలీస్ క్వార్టర్స్‌లో అదేపనిగా చప్పుళ్లు వినిపించాయి. ఏంటా అని అధికారులు వెళ్లి టార్చ్ వేసి చూశారు. కనిపించింది చూడగానే దెబ్బకు కంగుతిన్నారు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుంది. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.

కర్నూలు జిల్లా నంద్యాలలోని మహానంది పోలీస్ క్వార్టర్స్‌లో పెద్ద కొండచిలువ హల్చల్ చేసింది. పెరట్లో అదేపనిగా వింత చప్పుళ్లు వినిపించడంతో.. ఏంటా అని పోలీస్ అధికారులు టార్చ్ వేసి చూడగా.. అదొక కొండచిలువగా గుర్తించారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నాడు. కాగా, కొండచిలువ పట్టుబడటంతో పోలీస్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆ వీడియో మీరూ ఓ సారి లుక్కేయండి.

Published on: Sep 30, 2025 08:29 AM