Hyderabad: తెల్లారి ఎవరి పనుల్లో వారు ఉన్నారు.. ఇంతలో మూలాన వింత ఆకారం.. ఏంటని చూడగా
సరీసృపాలు.. జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం అయిపోయింది. హైదరాబాద్‌లో ఇదే తంతు జరిగింది. స్థానిక నివాసాలలోకి ఓ పైథాన్ వచ్చి ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి ఈ స్టోరీ లుక్కేయండి మరి.
పాము దూరంగా కనిపిస్తే చాలు.. దెబ్బకు దడుసుకుంటాం. అదే మనకు దగ్గరగా వస్తే ఇంకేమైనా ఉందా.? గుండె ప్యాంట్‌లోకి జారిపోతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక బహదుర్పురా ఎం.ఓ. కాలనీలో పైథాన్ కలకలం రేపింది. మస్కటి వీధిలో అకస్మాత్తుగా పాము కనిపించడంతో స్థానికులకు తీవ్ర ఆందోళన కలిగించింది. స్నేక్ క్యాచర్లు వెంటనే చేరుకుని, మట్టికుండను పగలగొట్టి పామును సురక్షితంగా బయటకు తీసి బ్యాగులో వేసారు. పిల్లలు బయట ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎక్కడైనా పాము కనిపిస్తే వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.