Vizag: గర్భగుడిని కడుగుదామని లోపలికి వచ్చిన పూజారి.. ఎదురుగా కనిపించింది చూడగా

Updated on: Sep 11, 2025 | 5:05 PM

అందరూ గుడికి దేవుడ్ని మొక్కేందుకు.. ఇది మాత్రమే భక్తులలో అలజడి రేపింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకోగా.. అది చూసిన భక్తులు దెబ్బకు పరుగో పరుగు.. ఇంటర్నెట్‌లో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరి అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా..

ఎప్పటిలానే బుధవారం సాయంత్రం భక్తులు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చారు. గుడి అంతా కోలాహలంగా ఉంది. ఈలోగా గర్భగుడిలో కనిపించిన సీన్ చూసి దెబ్బకు షాక్ అయ్యారు భక్తులు. ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈ ఘటన విశాఖపట్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రుషికొండ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ నాగుపాము హల్‌చల్ చేసింది. ఏకంగా గర్భగుడిలోకి చొరబడిన ఆ నాగుపాము.. పూజారితో పాటు భక్తులను కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఆలయ అధికారులు వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించారు. సమయానికి ఘటనాస్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా నాగుపామును రెస్క్యూ చేసి.. అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.