AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

Phani CH
|

Updated on: Sep 10, 2026 | 1:09 PM

Share

పూజల్లో ఎంతో పవిత్రంగా భావించే కొబ్బరికాయ చెట్టుపై ఎలా తయారవుతుందో తెలుసా? కొబ్బరి చెట్టుకు పూత రావడంతో మొదలయ్యే ఈ ప్రక్రియలో పరాగసంపర్కం, ఫలదీకరణ తర్వాత చిన్న పిందెలు ఏర్పడతాయి. క్రమంగా అవి పెరిగి లేత కొబ్బరి, కొబ్బరి నీరు, గుజ్జు ఏర్పడే దశలకు చేరుకుంటాయి. చివరికి బయట పీచు గట్టిపడి, గోధుమ రంగులోకి మారి పూర్తిగా పండిన కొబ్బరికాయగా రూపుదిద్దుకుంటుంది. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన జీవన చక్రం ఇది.

ప్రకృతి మనకు అందించే అద్భుతమైన ఫలం నారికేళం. అదేనండి కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను పూర్ణఫలం, శ్రీఫలం అనికూడా అంటారు. కొబ్బరికాయలో నీరు, గుజ్జు సహా అన్నీ పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి దీనిని పూర్ణఫలం అంటారు. ఏ ఇతర ఫలాలకు లూని ప్రత్యేకత ఈ కొబ్బరికాయకు, అరటిపండుకు మాత్రమే ఉన్నాయి. వ్రతాలు, నోములు నోచే సమయంలో కలశంపై కొబ్బరికాయను ఉంచి అందులోకి ఆ దేవతను ఆవాహన చేసి పూజచేస్తారు. ఇక కొబ్బరి నీటితో దేవతామూర్తులకు అభిషేకం చేస్తారు. కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తారు. కొబ్బరికాయ లేనిదే ఏ భక్తుడూ గుడికి వెళ్లడు. ఏదైనా శుభకార్యం ముగింపు దశలో కొబ్బరికాయను కొట్టి ముగిస్తారు. ఇక కొబ్బరితో అనేక రకాల వంటకాలు కూడా చేస్తారు. ఈ కొబ్బరి వంటకు మంచి రుచిని అందించడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కొబ్బరికాయ చెట్టుపై ఎలా తయారువుతుందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. కొబ్బరికాయ పూత దశనుంచి పూర్ణఫలంగా రూపు దిద్దుకునేవరకూ కొనసాగే ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ అద్భుతమైన ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదట కొబ్బరి చెట్టుకు గుత్తులు గుత్తులుగా పూత వస్తుంది. ఈ పూత దశలోనే భవిష్యత్తులో కొబ్బరికాయగా మారే చిన్న పువ్వులు ఉంటాయి. ఆ తర్వాత పువ్వులు పరాగసంపర్కం జరిగి ఫలదీకరణ చెందుతాయి. దీనితో పూత రాలిపోయి చిన్న చిన్న పిందెలుగా రూపుదిద్దుకుంటాయి. ఈ పిందె దశలో చెట్టుకు అందించే నీరు, పోషకాల ద్వారా ఇవి వేగంగా పెరుగుతాయి. అలా కొద్దిరోజులకు కాయ పరిమాణం పెరిగి, లోపల తియ్యటి నీరు ఏర్పడుతుంది. ఇదే మనం ఎంతో ఇష్టంగా తాగే లేత కొబ్బరి లేదా బోండాం దశ. ఆ తర్వాత కాయ మరింత పెద్దదై నీరు సమృద్ధిగా మారుతుంది. ఈ సమయంలోనే బయట ఉండే పీచు క్రమంగా మందంగా మారుతుంది. ఆరో దశలో కాయ లోపల తెల్లటి కొబ్బరి గుజ్జు మందంగా తయారవుతుంది. బయట పీచు గట్టిపడి కాయ తన పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. చివరిగా, ఏడో దశలో కాయ పూర్తిగా పక్వానికి వస్తుంది. బయట ఉన్న పీచు గోధుమ రంగులోకి మారి, లోపల గుజ్జు గట్టిపడుతుంది. పూత నుంచి కాయగా మారి, చివరకు పూర్తిగా పండిన కొబ్బరికాయగా మారే ఈ అద్భుత ప్రయాణం ప్రకృతిలోని జీవన చక్రానికి ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!

లోను తీసుకున్న వ్యక్తి కట్టలేకపోతే.. అది ఎవరు చెల్లించాలి.. బ్యాంకు రూల్స్‌ ఇవే!

Follow Us