Manali Snow Effect: మంచు నరకం! మనాలిలో 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

Updated on: Jan 26, 2026 | 9:59 PM

హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ మంచు మనాలి, సిమ్లాలో తీవ్ర ట్రాఫిక్ జామ్‌లకు దారితీసింది. మైనస్ డిగ్రీల చలిలో ఆహారం, నీరు లేక పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మనాలిలో 15 కి.మీ. దూరం ప్రయాణించడానికి 10 గంటలు పడుతోంది. IMD హెచ్చరికలతో, రాబోయే రోజుల్లోనూ ఇదే వాతావరణం కొనసాగనుంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన మనాలి, సిమ్లాలను భారీ మంచు కమ్మేసింది. మంచులో ఆనందించాలని వెళ్లిన పర్యాటకులు ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏకధాటిగా కురుస్తున్న మంచు కారణంగా మనాలిలో 15 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ దూరం ప్రయాణించడానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా, సిమ్లాలోనూ 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నడిరోడ్డుపై చిక్కుకుపోయిన పర్యాటకులు ఆహారం, మంచినీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది డ్రైవర్లకు వాహనాలు వదిలేసి, కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనాలిలో మైనస్ 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bangladesh: మొండికేసిన బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్! వరల్డ్ కప్ నుంచి అవుట్

కేదార్‌నాథ్, బదరీనాథ్ ప్యానల్ కీలక నిర్ణయం

తెలంగాణ భవన్ లో స్పెషల్ స్కిట్.. ఆయన పాత్ర చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే

Khammam: నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి

Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం