బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయాన్నే ఓ గ్లాస్ తాగితే చాలు
ఎండాకాలంలో శరీరానికి చల్లదనం, తక్షణ శక్తిని అందించే ఉత్తమ పానీయం రాగి జావ. కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లతో నిండిన ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని ఇంట్లోనే బాదం, జీడిపప్పుతో మరింత పోషకంగా తయారు చేసుకోవచ్చు. డయాబెటిస్ నియంత్రణ, ఎముకల బలం, జీర్ణక్రియ మెరుగుదల, వడదెబ్బ నివారణలో రాగి జావ ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. శరీరం త్వరగా అలసిపోతుంది, డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూ, వేడిని తగ్గించే అద్భుత పానీయం ‘రాగి జావ’. కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లకు నిలయమైన రాగి జావను బయట దొరికే పిండితో కాకుండా, ఇంట్లోనే స్వచ్ఛంగా, మరింత బలవర్ధకంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్వచ్ఛమైన రాగులు, పావుకిలో బాదం పప్పు, పావుకిలో జీడిపప్పు , ఒక ఐదు నుంచి 6 యాలకులు తీసుకొని, ముందుగా రాగులను శుభ్రం చేసుకుని, మందపాటి పాత్రలో చిన్న మంటపై 10 నిమిషాల పాటు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. వీటితో పాటే యాలకులను కూడా వేయించి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. అలాగే బాదం, జీడిపప్పులను కూడా విడివిడిగా వేయించుకొని చల్లార్చాలి. వీటిని మిక్సీలో వేసి ‘పల్స్’ మోడ్‌లో అంటే ఆపుతూ.. ఆన్ చేస్తూ గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నూనె బయటకు రాకుండా పొడిపొడిగా ఉంటుంది. వేయించిన రాగులను కూడా మెత్తగా గ్రైండ్ చేసి, ఆ పిండిని బాదం-జీడిపప్పు పొడితో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. రాగిజావ తయారు చేయడం కోసం రాత్రిపూట కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ప్రతి వ్యక్తికి రెండు చెంచాల చొప్పున పిండిని తీసుకొని నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం స్టవ్ మీద నీళ్లు పెట్టి అవి మరుగుతున్నప్పుడు ఈ నానబెట్టిన పిండిని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. చిక్కబడిన తర్వాత దీనిని దించి, మజ్జిగ లేదా పాలు కలుపుకోవాలి. రుచి కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా నల్ల ఉప్పు చేర్చుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. రాగుల్లో అధిక కాల్షియం ఉంటుంది. అందుకే ఈ జావ తాగడం వల్ల ఎముకల బలంగా తయారవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉత్తమ ఆహారం. ఇందులో ఉండే ఫైబర్ వల్ల ఆకలి త్వరగా వేయదు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. రోజూ ఉదయం పరగడుపున ఈ రాగి జావను తీసుకోవడం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణాలోని మగవారిలో కొత్త టెన్షన్.. దేశంలో ఇక్కడే ఆ సమస్య ఎక్కువ!
మధురఫలం.. విషపూరితం.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న వ్యాపారులు
డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు
