వేసవిలోనూ మీ జుట్టును కాపాడుకోండి ఇలా..!

Updated on: Apr 29, 2026 | 4:40 PM

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, చెమట వల్ల జుట్టు రాలడం, జిడ్డు, చుండ్రు వంటి సమస్యలు పెరుగుతాయి. ఎండ వేడిమి నుండి జుట్టును కాపాడటానికి నిపుణులు కొన్ని కీలక సూచనలు ఇస్తున్నారు. తరచుగా తలస్నానం చేయడం, బయటకు వెళ్ళినప్పుడు టోపీ ధరించడం, తగినంత నీరు త్రాగడం, పోషకాహారం తీసుకోవడం ద్వారా మీ జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవచ్చు. సమస్యలు అధికమైతే వైద్యుడిని సంప్రదించండి.

వేసవి కాలంలో మనం చర్మం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, సన్‌స్క్రీన్ లోషన్లు రాస్తాం. కానీ అదే ఎండలో జుట్టు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతుందని చాలామంది మర్చిపోతారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, చెమట వల్ల జుట్టు రాలడం, తల పై భాగంలో సమస్యలు సర్వసాధారణం. ఈ వేసవిలో మీ కురులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి నిపుణులు చెప్పే సూచనలు మీకోసం. వేసవిలో ఎండల తీవ్రత వల్ల తలలో విపరీతమైన చెమట పడుతుంది. దీనివల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది. ఇది దుమ్ము, ధూళిని త్వరగా ఆకర్షించి జుట్టును నిర్జీవంగా చేస్తుంది. తల చర్మం చాలా సున్నితంగా ఉంటంది. వేడికి, తేమకు ఇది త్వరగా స్పందిస్తుంది. దీనివల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. నేరుగా సూర్యరశ్మి తల చర్మంపై పడటం వల్ల మంట, దురద సమస్యలు వస్తాయి. నిపుణుల సూచనల ప్రకారం.. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి, ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తప్పనిసరిగా తలస్నానం చేయాలి. దీనివల్ల తల చర్మంపై పేరుకున్న జిడ్డు, చెమట తొలగిపోయి జుట్టు శుభ్రంగా ఉంటుంది. ఎండలోకి వెళ్లేటప్పుడు టోపీ లేదా స్కార్ఫ్ ధరించడం మర్చిపోవద్దు. ఇది తల చర్మానికి నేరుగా సూర్యరశ్మి తగలకుండా రక్షణ కల్పిస్తుంది. తల చర్మంపై విపరీతమైన దురదగా అనిపిస్తే, అది ఇన్ఫెక్షన్ లేదా చుండ్రు వల్ల కావచ్చు. అటువంటి సమయంలో సొంత చికిత్సలు చేయకుండా, వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. బయట ఎంత జాగ్రత్త తీసుకున్నా, లోపల నుండి కూడా జుట్టు ఆరోగ్యంగా ఉండాలి. తగినంత నీరు త్రాగడం, పోషకాహారం తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. సవిలో జుట్టు విషయంలో కొంచెం శ్రద్ధ వహిస్తే, ఎండల తీవ్రత నుండి మీ కురులను సురక్షితంగా కాపాడుకోవచ్చు. నిరంతరం శుభ్రతను పాటిస్తూ, ఎండ నుండి రక్షణ కల్పించుకోవడం ఈ సీజన్‌లో జుట్టు సంరక్షణకు కీలకంగా చెప్పవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖ జూలో ‘ఘోస్ట్ ఆఫ్ జంగిల్’

స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..

భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే

ఎండలకు పొట్ట ఉబ్బరమా ?? మీ మీల్ ప్లాన్ ఎలా ఉండాలంటే !!

Follow Us