వీధి కుక్కల కోసం మౌన పోరాటం.. ప్లకార్డులతో మూగజీవాల హక్కులపై అవగాహన కల్పిస్తున్న ప్రశాంత్

Edited By:

Updated on: Jun 01, 2026 | 7:43 PM

హనుమకొండకు చెందిన జంతు ప్రేమికుడు సుంకరి ప్రశాంత్ వీధి కుక్కల రక్షణ కోసం వినూత్న మౌన నిరసన చేపట్టారు. ప్లకార్డులు, ఫ్లెక్సీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వీధి కుక్కలకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, మూగజీవాల సంక్షేమానికి కేటాయించిన నిధుల వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

వీధి కుక్కలను రక్షించాలని జంతు ప్రేమికుడు,జ్వాల స్వస్చంద సంస్థ నిర్వాహకుడు వినూత్న పోరాటం చేస్తున్నాడు..వాటి ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్న ఆయన తన ఇంటి పరిసరాల్లో మూగ జీవుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్ల కార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. హనుమకొండ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ నిర్వాహకుడు సుంకరి ప్రశాంత్ వీధి కుక్కల రక్షణ కోసం వినూత్న రీతిలో ఈ పోరాటం చేస్తున్నాడు. ఎలాంటి నినాదాలు చేయకుండా, ప్లే కార్డులకు నల్ల బ్యాడ్జీలు ఏర్పాటుచేసి మౌనంగా నిరసన తెలిపారు.. వీధి కుక్కలకు ఆహారం, తాగునీరు ఏర్పాటు చేసి ఆ మూగజీవులకు నేనున్నానని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ప్లకార్డుల ముందు వీధి కుక్కలు మౌనంగా ఆహారం తీసుకోవడం ద్వారా “సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలి…మూగ జీవాలను రక్షించాలి” అనే సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు..భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(g) ప్రకారం జంతువుల పట్ల కరుణ చూపడం ప్రతి పౌరుడి బాధ్యతని తెలిపారు. “జంతు క్రూరత్వ నిరోధక చట్టం – 1960” ప్రకారం మూగజీవాలను హింసించడం, ఆహారం, నీరు నిరాకరించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే వీధి కుక్కల సంరక్షణ, స్టెరిలైజేషన్ (ABC), వ్యాక్సినేషన్ మరియు సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వీధి కుక్కల పేరుతో కేటాయించిన బడ్జెట్‌ను అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోరులేని వీధి కుక్కల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, హింసాత్మక చర్యలు కాకుండా శాస్త్రీయ పద్ధతిలో స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్, ఆహారం మరియు తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టే జంతు ప్రేమికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిని వేధించడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక సంస్థలు జంతు సంక్షేమ కమిటీలను బలోపేతం చేసి మూగజీవాల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవల వెలువడిన సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించి, మూగజీవాల ప్రాణహక్కులను రక్షించే విధంగా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!

అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’

ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్‌!

Follow Us