ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్తే తొక్కేస్తా..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో రంగం భవిష్యవాణి భక్తులను ఆందోళనకు గురిచేసింది. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, భారీ జలప్రళయం, అగ్నిప్రమాదాలు సంభవిస్తాయని మాతంగి స్వర్ణలత ద్వారా అమ్మవారు హెచ్చరించారు. ఆలస్యానికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన ఆదేశాలను ధిక్కరిస్తే నలిపేస్తానని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో రంగం కార్యక్రమం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. ఈ సందర్భంగా అమ్మవారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కనిపించింది.ఆరు నెలల్లో తన విగ్రహ ప్రతిష్ఠ జరపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తన మాటను ధిక్కరిస్తే ఊరుకునేది లేదని అమ్మవారు హెచ్చరించారు. రాష్ట్రాన్ని భారీ జలప్రళయం ముంచెత్తబోతుందని, ఊహించని రీతిలో అగ్నిప్రమాదాలు సంభవిస్తాయని స్పష్టం చేశారు. మనుషులలో అహంకారం పెరిగిందని, వావివరసలు మరిచి ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. తాను సంతోషంగా లేనని, మీపై కోపంగా ఉన్నానని మాతంగి స్వర్ణలత ద్వారా అమ్మవారు వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా విగ్రహ ప్రతిష్ఠ అంశం అపరిష్కృతంగా ఉండటం పట్ల అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పనని తొలుత నిరాకరించిన అమ్మవారు, అర్చకుల వేడుకోలు తర్వాత భవిష్యవాణిని కొనసాగించారు. రంగం ముగిసిన అనంతరం అమ్మవారి శాంతి కల్యాణం, ఊరేగింపు వైభవంగా జరిగాయి.
మరిన్ని వీడియోల కోసం :
మళ్లీ మొదటికొచ్చిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం
ఇడుపుకాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శలు విని బాధ కలిగింది
