Hyderabad: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు..

Updated on: Feb 10, 2026 | 7:28 PM

మేడ్చల్ జిల్లా గాజులరామారంలో మంగళవారం ఉదయం సంభవించిన భూ ప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. భారీ శబ్దంతో ఇళ్లు కదలడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇది భూకంపమా లేక సమీప క్వారీ పేలుళ్ల ప్రభావమా అన్నది అస్పష్టంగా ఉంది. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అధికారులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని గాజులరామారంలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భూప్రకంపనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. ముఖ్యంగా మెట్కాన్ గూడ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మంగళవారం ఉదయం సరిగ్గా 10:10 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పాటు భూమి కంపించినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఇళ్లలోని సామాగ్రి కదలడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ అకస్మాత్తు పరిణామంతో అప్రమత్తమైన స్థానిక పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే స్కూళ్లకు సెలవు ప్రకటించి, పిల్లలను ఇళ్లకు పంపించాయి. భారీ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేదా సమీపంలోని క్వారీలలో జరిగిన పేలుళ్ల ప్రభావమా అన్నది తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా భూకంపం సంభవిస్తే ప్రకంపనల తీవ్రతను సిస్మోగ్రాఫ్ ద్వారా రికార్డు చేస్తారు. అయితే, ఇప్పటివరకు అటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు భూగర్భ శాస్త్రవేత్తలు కానీ ఈ ఘటనపై అధికారిక ప్రకటన చేయలేదు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఒక్కసారిగా సంభవించిన ఈ ప్రకంపనలతో గాజులరామారం వాసులు భయం నీడలోనే గడుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి

ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో

వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు

ప్రేమంటే ఇదేరా !! పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే 70 కి.మీ సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు

ఇండియా దెబ్బ.. పాక్ అబ్బా.. తొమ్మిది నెలలైనా తేరుకోలేదుగా

Loading...
Unable to load recommendations.
Follow Us