Shanmukh Jaswanth: ఏంటి.. పెళ్లి అయిపోయిందా ?? ఫోటోలతో అభిమానుల్లో చర్చ

Updated on: Apr 06, 2026 | 8:41 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఇటీవల వైష్ణవితో ఘనంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే, ఆయన స్నేహితుడు పెళ్లి ఫోటోలు షేర్ చేయడంతో షణ్ముఖ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు షాక్‌కు గురయ్యారు. కొందరు ఇది ప్రీ-వెడ్డింగ్ షూట్ అంటుంటే, మరికొందరు రహస్య వివాహంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్‌తో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. ఉన్నట్టుండి తానో అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ రివీల్ చేసి.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అయ్యాడు. ఆ టాపిక్ అలా కంటిన్యూ అవుతుండగానే.. తన ప్రేమసితో ఎంగ్మేజ్‌మెంట్ చేసుకుని.. ఆ గుడ్‌ న్యూస్‌తో అక్రాస్ సోషల్ మీడియా వైరల్ అయ్యాడు. కట్ చేస్తే ఇప్పుడు చడీచప్పుడు కాకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా? ఏంటి ? అనే అనుమానాలు కలిస్తున్నాడు. ఫిబ్రవరి 25న చాలా గ్రాండ్‌గా షణ్ముఖ్ – వైష్ణవి ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే షణ్ముఖ్ ఫ్రెండ్ … ఓ ఫోటోగ్రాఫర్ తన వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పేజీలో షణ్ముఖ్ – వైష్ణవి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కొన్ని షేర్ చేశాడు. ‘నా ప్రాణ స్నేహితుడికి పెళ్లి జరిగింది. ఈ ఫోటోలు తీయడం, వీటిని షేర్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ఫోటోలు చూసిన షణ్ను ఫ్యాన్స్… ఈయనకి పెళ్లి అయిపోయిందా? అంటూ సోషల్ మీడియాలో షాక్ అవుతున్నారు. ఎంగేజ్మెంట్ గ్రాండ్‌ గా చేసుకుని.. పెళ్లి ఇలా సీక్రెట్‌గా చేసుకోవాల్సిన అవసరం ఏంటని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరేమో.. అవి ప్రీ వెడ్డింగ్‌ సంబంధించిన ఫోటోలని.. చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డే1 కలెక్షన్స్‌లో బైకర్‌ను దాటిన రాకాస !!

Bhanupriya: నా అక్క భాను ప్రియా పిచ్చిది కాదు.. స్పందించిన శాంతిప్రియ

Komarakka: ‘కొమురక్క తేడా గాడు..’ సాక్ష్యాలతో సంచలన ఆరోపణలు చేసిన అసిస్టెంట్

Ramayana: 4000 కోట్ల రూపాయల అద్భుతం: ‘రామాయణ’ గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ

రామాయణ Vs ఆదిపురుష్… తప్పు దిద్దుకుంటారా ??

Follow Us