రామ్ చరణ్ కెరీర్ కు ఇది గేమ్ ఛేంజర్ అవుతుందా ??

Updated on: Dec 31, 2024 | 12:36 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.

తెలుగమ్మాయి అంజలి మరో కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు అభిమానులు. గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో డిసెంబర్‌ 29 మధ్యాహ్నం 3 గంటలకు చిత్ర యూనిట్‌ ఈ బిగ్గెస్ట్ కటౌట్ ను ఆవిష్కరించింది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్‌తో రామ్ చరణ్ కటౌట్‌కి పూలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరైంది. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా వచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OG అంటూ ఫ్యాన్స్ అరుపులు.. చిరాకుతో అరిచిన పవన్

పోలీసులకు సంధ్యా థియేటర్‌ నుంచి ఘాటు రిప్లయ్

వారసత్వం కాదు.. పనితనం !! అన్నకు మంత్రి పదవిపై పవన్‌ కామెంట్స్

చరణ్ సినిమా ఈవెంట్‌కు పవన్‌ ?? దిల్ రాజు పర్సనల్ రిక్వెస్ట్

అక్కినేనిపై మోదీ ప్రశంసల వర్షం !!

Loading...
Unable to load recommendations.
Follow Us