దీపిక బ్యాడ్‌లక్‌ కాస్తా.. రుక్మిణీ గుడ్‌లక్‌ అయిందిగా.. ప్రభాస్ పక్కన బంపర్ ఆఫర్

Updated on: May 24, 2025 | 1:51 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో దీపికా హీరోయిన్‌గా నటించనుందని ఈ మధ్య వార్తలు వినిపించాయి.

ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. దీపికా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని దాంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తుంది. సందీప్ తన సినిమాల్లో నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకుంటాడని, సినిమాకు నష్టం జరిగే అవకాశం ఉంటే ఎవరినైనా పక్కన పెట్టడానికి వెనుకాడడని టాక్ ఉంది.ఈ క్రమంలోనే ఈమెను పక్కన పెట్టాడని ఈమె స్థానంలో మరో హీరోయిన్ రుక్మిణిని తీసుకున్నాడని లేటెస్ట్ అప్డేట్. అయితే దీపికా తప్పుకోవడానికి కారణాలు ఇవే అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీపికా రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుందని అలాగే సినిమా లాభాల్లో వాటా అడిగిందని..అలాగే 8 గంటల వర్కింగ్ షిఫ్ట్, తెలుగు డైలాగులు చెప్పడానికి నిరాకరణ వంటి షరతులు వల్ల డిఫరెన్సెస్ వచ్చాయని. ఈ షరతులు సందీప్‌కు నచ్చలేదని అందుకే ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ ఎంట్రీ ఇచ్చిందని టాక్. ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఎంట్రీ ఇచ్చిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమర జవాన్ కుంటుంబానికి ఆర్థిక సాయం.. చిన్న హీరోయిన్ పెద్ద మనసు !!