పాటతో దేశాన్ని ఊపిన ఫోక్ సింగర్‌కు కింగ్ నాగ్ బంపర్ ఛాన్స్?

Updated on: Jul 16, 2025 | 8:40 PM

బిగ్ బాస్ సీజన్ 9 కు రంగం సిద్ధం అయ్యింది. తొందర్లో ఈ గేమ్‌ షో మొదలు కానుంది. దీంతో.. ఇప్పుడు బిగ్ బాస్‌ మేకర్స్ కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు. షోకు ప్లస్‌ అయ్యేలా... టీఆర్పీ రేటింగ్ పెరిగేలా సెలబ్రిటీలను ఎంచుకునే ప్రక్రియ మొదలెట్టారు. ఈ క్రమంలోనే ఈ మధ్య ఫోక్ సాంగ్స్‌లో అందర్నీ ఆకట్టుకుంటున్న లక్ష్మీ బిగ్ బాస్‌ కోసం సెలక్ట్ అయ్యారని ఇన్‌సైడ్ టాక్.

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఫోక్ ఫీల్డ్‌లో తన సాంగ్స్‌తో ఇప్పటికే విపరీతంగా పాపులర్ అయింది లక్ష్మి. సోషల్ మీడియాలో దుమ్మురేపిన.. తిన్నా తీరం పడుతలే.. కూసున్నా తీరం పడుతలే.. సాంగ్.. ఆనాడేమన్న అంటినా తిరుపతి.. నిన్ను ఈనాడేమన్న అంటినా తిరుపతి సాంగ్‌తో ఎంతో పాపులర్ అయింది లక్ష్మీ. ఇక లక్ష్మీ బ్యాగ్ గ్రౌండ్ విషయానికి వస్తే.. నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం గన్నోర గ్రామానికి చెందిన ఈ జానపద సింగర్ చిన్నతనం నుంచి పాటలు పాడుతుంది. ఫోక్ సాంగ్స్ తో పాపులరైన లక్ష్మీకి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2లో పీలింగ్స్ అనే సాంగ్ పాడే అవకాశం అందుకుంది. ఈ సాంగ్‌తో తెలుగు టూ స్టేట్స్‌లోనూ హాట్ టాపిక్ అయింది. పుష్ప 2 సినిమా కంటే ముందు బ్యాచ్ సినిమాలో ఓ సాంగ్, అలాగే దసర సినిమాలో ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ సాంగ్ పాడింది లక్ష్మీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షో చూడు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పట్టు.. సుడిగాలి సుధీర్ నుంచి బంపర్ ఆఫర్ !

‘నెలకు 40 లక్షలు భరణంగా ఇవ్వాలి’ మాజీ భార్య దెబ్బకు..

బంగారం లాంటి ఛాన్స్‌ వస్తే.. ఈ పిల్ల కాళ్లతో తన్నింది..

3 నిమిషాలకు 3 కోట్లు.. ఏ స్టార్ ఫిల్మ్ అయినా.. మనీ మ్యాటర్లో నో కాంప్రమైజ్‌!

18 ఏళ్లు ఎదురుచూసినా..ఆ కోరిక తీరకుండానే.. పాపం! కోట