Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..

Updated on: Mar 16, 2026 | 9:11 PM

త్రిష కృష్ణన్ పేరు జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. దళపతి విజయ్‌తో ఆమె సంబంధాలపై వస్తున్న ఊహాగానాలు, ముఖ్యంగా విజయ్ విడాకుల వార్తల తర్వాత పెళ్లి వేడుకకు కలిసి హాజరుకావడం దీనికి కారణం. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు, రాజకీయ ప్రవేశ పుకార్లు, పాత వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అయితే, త్రిష వీటిని పట్టించుకోకుండా తన పని చేసుకుపోతున్నారు.

సౌత్ బ్యూటీ త్రిష కృష్ణన్ పేరు ప్రస్తుతం జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. దీనికి ప్రధాన కారణం నటుడు దళపతి విజయ్‌తో ఆమె రిలేషన్‌షిప్‌కు సంబంధించిన వార్తలు వైరల్ కావడమే. ముఖ్యంగా విజయ్ విడాకుల వార్తలు తెరమీదకు వచ్చిన వెంటనే, త్రిష ఆయనతో కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరుకావడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో వీరి బంధంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా అప్డేట్స్ లేకపోయినా, త్రిష నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో త్రిష రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారనే వార్తలు కూడా కొన్నాళ్లపాటు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, “చచ్చేవరకు నటిస్తూనే ఉంటా” అంటూ త్రిష గతంలో చేసిన వ్యాఖ్యలను ఆమె అభిమానులు ఇప్పుడు మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు. చెన్నై చంద్రం పేరుతో ఆన్‌లైన్‌లో ఆమె కౌంటర్ స్టేట్‌మెంట్‌లతో సందడి సృష్టిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూటు మారుస్తున్న దర్శకులు..మ్యాజిక్‌ రిపీట్ చేస్తారా

సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా

తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు

‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్‌ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్

‘హీరోయిన్ అంటారు.. చివరికి వ్యభిచారంలో నెట్టేస్తారు’

Follow Us