హీరో ఫ్యాన్సే టార్గెట్.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
ఒకప్పుడు పాన్ ఇండియా అంటే బైలింగ్యువల్ సినిమాలే అనే భావన ఉండేది. ఇప్పుడు మాత్రం స్టార్ దర్శకులు ఆ ట్రెండ్‌కు గుడ్‌బై చెబుతున్నారు. హీరో నేటివ్ భాషలోనే సినిమా తీసి, తర్వాత ఇతర భాషల్లో డబ్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. నేటివిటీ దెబ్బతినకుండా, ప్రధాన మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడమే ఈ మార్పుకు ప్రధాన కారణంగా మారింది.
ఎవరు ఏమన్నా ఫిలిం ఇండస్ట్రీ హీరో సెంట్రిక్‌గానే నడుస్తుంది. హీరో మార్కెట్, నేటివ్ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగానే సినిమాలు రెడీ అవుతాయి. ఒకప్పుడు ప్యాన్ ఇండియా అంటే బైలింగ్యువల్, ట్రైలింగ్యువల్ అంటూ ప్రయోగాలు చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మన దర్శకులు బోర్డర్స్ దాటుతున్నా.. హీరో ఎవరైతే వాళ్ల నేటివ్ లాంగ్వేజ్‌లోనే సినిమాలు తీస్తున్నారు. అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది? బైలింగ్యువల్స్ వద్దని స్టార్ డైరెక్టర్లు ఎందుకు ఫిక్స్ అయ్యారు? ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ దర్శకుడు, మరో ఇండస్ట్రీ స్టార్ హీరోతో సినిమా చేస్తే కచ్చితంగా బైలింగ్యువల్ మూవీనే ప్లాన్ చేసేవారు. కానీ ఇప్పుడు దర్శకులకు, హీరోలకు ఒక క్లారిటీ వచ్చింది. రెండు పడవల మీద కాలు వేసి నేటివిటీ మిస్ అయ్యే బదులు.. హీరోకి ఉన్న మెయిన్ మార్కెట్, ఆయన నేటివ్ లాంగ్వేజ్ మీదే ఫోకస్ చేయటం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి తన కొత్త సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తమిళ సినిమానే అని క్లారిటీ ఇచ్చారు. నిజానికి గతంలోనూ మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. వంశీ పైడిపల్లి, విజయ్‌తో తీసిన ‘వారసుడు’… అనుదీప్, శివ కార్తికేయన్‌తో చేసిన ‘ప్రిన్స్’ సినిమాలు కూడా పక్కా తమిళ ఫ్లేవర్‌తో అక్కడే తెరకెక్కించి.. ఆ తర్వాత మిగతా భాషల్లోకి డబ్ చేశారు. మరోవైపు మన దగ్గరకు వస్తున్న తమిళ డైరెక్టర్లు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ హీరోలతో వాళ్లు చేసే ప్రాజెక్టులను బైలింగ్యువల్స్ అని అనవసరంగా బలవంతపు కోలీవుడ్ నేటివిటీని ఇరికించడం లేదు. మన హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా, పక్కా తెలుగు కమర్షియల్ మీటర్‌లోనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ ట్రెండ్ కేవలం సౌత్‌కే పరిమితం కాలేదు. బాలీవుడ్ వెళ్తున్న మన సౌత్ డైరెక్టర్లు కూడా అక్కడ పక్కా స్ట్రెయిట్ సినిమాలే చేస్తున్నారు. హిందీ స్టార్స్‌తో పాన్ ఇండియా, బైలింగ్యువల్స్ అంటూ హంగామా చేయకుండా.. నార్త్ ఆడియన్స్ పల్స్‌కి తగ్గట్టుగా ప్యూర్ హిందీ సినిమాలనే రూపొందించి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. జవాన్, యానిమల్, జాట్ సినిమాలు అలా వర్కవుట్ అయినవే. మొత్తానికి ఏ భాష హీరో అయితే ఆ భాషలోనే సినిమా తీసి డబ్ చేయడం సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనే కన్‌క్లూజన్‌కు వచ్చేశారు మేకర్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందేభారత్ స్లీపర్ అదుర్స్.. విదేశీ మహిళ ప్రశంసలు
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
ట్రెండ్ మారింది గురూ.. వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
