కేరళలో రోడ్డుకు ఘనంగా పెళ్లి !! ఎందుకంటే ??

|

Feb 29, 2024 | 10:55 AM

ఇదేంటి రోడ్డుకు పెళ్లి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.. రోడ్డు విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణకు కేరళ కోజికోడ్‌లోని కొడియాత్తూరు గ్రామస్థులు ఏకంగా రోడ్డుకు పెళ్లి చేశారు. ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు బిర్యానీ, స్వీట్లు వడ్డించారు. రోడ్డుకు పెళ్లి అనగానే వధువు రోడ్డు ఎవరు? వరుడు రోడ్డు ఎవరు? అనుకుంటున్నారా? ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు. కేవలం నిధుల సమీకరణ కోసం మాత్రమే రోడ్డుకు పెళ్లి పేరుతో కార్యక్రమం నిర్వహించారు.

ఇదేంటి రోడ్డుకు పెళ్లి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.. రోడ్డు విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణకు కేరళ కోజికోడ్‌లోని కొడియాత్తూరు గ్రామస్థులు ఏకంగా రోడ్డుకు పెళ్లి చేశారు. ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు బిర్యానీ, స్వీట్లు వడ్డించారు. రోడ్డుకు పెళ్లి అనగానే వధువు రోడ్డు ఎవరు? వరుడు రోడ్డు ఎవరు? అనుకుంటున్నారా? ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు. కేవలం నిధుల సమీకరణ కోసం మాత్రమే రోడ్డుకు పెళ్లి పేరుతో కార్యక్రమం నిర్వహించారు. కొడియాత్తూరులో 1200 మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పైన రోడ్డు ఉంది. దీనిని 1980ల్లో నిర్మించారు. అనంతరం ఆ గ్రామ జనాభా 3 రెట్లు పెరిగింది. వాహన రాకపోకలూ బాగా పెరిగాయి. గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేయడం, రోడ్డు విస్తరణ పనుల కోసం స్థానికులు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేస్తే కొన్ని కుటుంబాలు భూమిని కోల్పోతాయని గుర్తించారు. భూములు కోల్పోయేవారికి పరిహారం చెల్లించడానికి, రహదారి నిర్మాణానికి కలిపి 60 లక్షల వరకూ ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల కోసం క్రౌడ్‌ ఫండింగ్‌ చేపట్టాలని నిర్ణయించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాకిస్తాన్ లోని పంజాబ్‌ కు తొలి మహిళా సీఎం.. చరిత్ర సృష్టించిన మరియం నవాజ్‌

కుమారుడు మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసా ??

Varun Tej: ఎంగేజ్‌మెంట్‌కు..పెళ్లికి గ్యాప్ వచ్చింది ఎందుకంటే ??

కెరీర్ టర్న్‌ అయ్యే సినిమా మిస్సు.. వెరీ బ్యాడ్‌లక్ బ్రో

Pushpa 2: 50కోట్లతో జాతర సాంగ్‌.. ఒక్కొక్కడికీ పూనకాలు రావాల్సిందే