vijay rashmika: ట్రెండ్ అవుతున్న విరోష్ హ్యాష్ ట్యాగ్

Edited By:

Updated on: Apr 07, 2026 | 8:58 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 'రణబలి' షూటింగ్ పూర్తి చేసుకున్నారు. రాయలసీమతో విజయ్ అనుబంధం, రష్మిక "మనం ముగ్గురం అయ్యాం" పోస్ట్ అభిమానుల్లో ఆసక్తి రేపాయి. జపాన్‌లో క్రంచీరోల్ అవార్డుల కోసం రష్మిక పర్యటన, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, సెప్టెంబర్ 11న 'రణబలి' విడుదలపై అంచనాలు పెరిగాయి.

పెళ్లైన కొత్తలో జీవితం ఎంత సందడిగా ఉంటుందో డైరక్ట్ గా తెలుసుకుంటున్నామంటున్నారు విరోష్‌. ఓ వైపు పర్సనల్‌ స్పేస్‌, మరోవైపు ప్రొఫెషనల్‌ గ్రోత్‌.. కొన్నిసార్లు రెండిటినీ మిక్స్ చేస్తూ, విడివిడిగా చూస్తూ.. ఎలాగైతేనేం.. వైబ్‌ ని ఎంజాయ్‌ చేస్తోందీ నవ జంట. రణబాలి సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయింది. ఆ సినిమా షూట్‌కి సతీ సమేతంగా హాజరయ్యారు విజయ్‌ దేవరకొండ. ఈ టైమ్‌లో రాయలసీమ వాళ్లు తన మీద చూపించిన ఆప్యాయతలకు పొంగిపోయారు. తనలో సీమ ఫీల్‌ ఉందంటూ ఓపెన్‌ అయ్యారు. రాయలసీమలో అడుగుపెడితే సొంతింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని చెప్పారు. సీమతో ఉన్న అనుబంధాన్ని విజయ్‌ షేర్‌ చేసుకుంటే, మనం అప్పుడే ముగ్గురం అయిపోయామోచ్‌ అంటూ ఆనందాన్ని పంచుకున్నారు రష్మిక మందన్న. ఇన్‌స్టా అకౌంట్‌లో రష్మిక ఆ రకంగా ఎందుకు పెట్టారోననే ఆసక్తి ఇమీడియేట్‌గా క్రియేట్‌ అయింది. పొద్దు తిరుగుడు పువ్వును ఉద్దేశించే పెట్టారా? లేకుంటే సమ్‌థింగ్‌ స్టార్ట్ అయిందా? అంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు ఫ్యాన్స్. సీమతో విజయ్‌ కనెక్ట్ అయిన టైమ్‌లోనే జపాన్‌ కాలింగ్‌ అంటూ పోస్టు పెట్టారు రష్మిక మందన్న. క్రంచీ రోల్‌ అనిమే అవార్డ్స్ ప్రధానోత్సవంలో ప్రెజెంటర్‌గా పాల్గొంటున్నారీ లేడీ. ఆల్రెడీ ఒకసారి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ ఈ అవార్డుల కోసం జపాన్‌ వెళ్తున్న లేడీగా రికార్డు క్రియేట్‌ చేశారు. సెప్టెంబర్‌ 11 ఎప్పుడెప్పుడు వస్తుందా? వీరిద్దరు కలిసి నటించిన రణబాలి ఎప్పుడు చూస్తామా? అని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు జనాలు. సిల్వర్‌ స్క్రీన్‌ మీద వారిద్దరూ కలిసి కనిపిస్తే ఇప్పటిదాకా పండగే. రణబాలిలో అది మరింత పీరియాడిక్‌ టచ్‌ మెస్మరైజ్‌ చేయడం ఖాయం అంటున్నారు మేకర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Liquor: మందుబాబులకు షాక్.. పెరగనున్న మద్యం ధరలు

తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Biker Collection: బాక్సాఫీస్‌ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్

Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట

Loading...
Unable to load recommendations.
Follow Us