Varun Tej: హిట్ సెంటిమెంట్ ను నమ్ముకున్న వరుణ్ తేజ్.. ‘కొరియన్ కనకరాజు’పై భారీ ఆశలు

Edited By:

Updated on: Jul 19, 2026 | 11:01 AM

వరుస పరాజయాల తర్వాత వరుణ్ తేజ్ ఆశలన్నీ 'కొరియన్ కనకరాజు'పైనే ఉన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగుతుండటంతో ఇటీవల విజయాలు సాధించిన సీమ బ్యాక్‌డ్రాప్ సెంటిమెంట్ తనకూ కలిసొస్తుందని మెగా హీరో భావిస్తున్నారు. ఆగస్టు 7న విడుదల కానున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌కు కీలక మలుపు కానుందనే అంచనాలు ఉన్నాయి.

వరుస పరాజయాలతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ ఈసారి సూపర్ హిట్ సెంటిమెంట్ పట్టుకున్నారు.. అదే తనను ఒడ్డున పడేస్తుందని నమ్ముతున్నారాయన. ఈ మధ్య కాలంలో సమంత, అఖిల్, కిరణ్ అబ్బవరంలకు కలిసొచ్చిన బ్యాక్‌డ్రాపే తనకు కూడా కలిసొస్తుందని బలంగా నమ్ముతున్నారు మెగా హీరో. ఇంతకీ ఏంటా సెంటిమెంట్.. అది వరుణ్ తేజ్ కెరీర్‌ను కూడా మార్చేస్తుందా..? విభిన్నమైన కథలను ఎంచుకునే వరుణ్ తేజ్.. ఈసారి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 7న రానుంది. రాయలసీమలో మొదలయ్యే కథ కొరియాకి వెళ్తుంది. అక్కడ్నుంచి ఏం జరుగుతుందనేది అసలు కథ. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తే ఉంది. పైగా వరుణ్ తేజ్‌కు సీమ సెంటిమెంట్ హెల్ప్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర రాయలసీమ నేపథ్యంతో వచ్చిన సినిమాలకు కలెక్షన్లు అదిరిపోతున్నాయి. మొన్న సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ ఏకంగా 100 కోట్లు వసూలు చేస్తే.. అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ కూడా మంచి విజయం సాధించింది. అంతేకాదు కిరణ్ అబ్బవరం నిర్మించిన తిమ్మరాజుపల్లి అనే చిన్న సినిమా కూడా మెప్పించింది. సరిగ్గా ఇదే సీమ సెంటిమెంట్‌ను నమ్ముకుని వరుణ్ తేజ్ వస్తున్నారిప్పుడు. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరోకు కొరియన్ కనకరాజు విజయం కీలకంగా మారింది. అందుకే ట్రెండింగ్‌లో ఉన్న సీమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు వరుణ్. మరోవైపు మేర్లపాక గాంధీకి కూడా ఈ సినిమా విజయం కీలకమే. చూడాలిక ఇద్దరూ కలిసి ఏం చేస్తారో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: వారణాసికి అనుకోని సమస్య.. జక్కన్న ప్లాన్ ఏంటో..?

Suriya : ‘కరుప్పు’ విజయం తర్వాత సూర్య ఫుల్ స్పీడ్

పెద్ద సినిమాలకు A సర్టిఫికెట్.. పెద్దలకు మాత్రమే..!

ట్రెండ్ సెట్ చేస్తున్న టాప్ బ్యూటీస్

టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న తమిళ హీరోలు

Published on: Jul 19, 2026 11:01 AM
Loading...
Unable to load recommendations.
Follow Us