Varanasi: మహేష్‌ ఫోకస్‌ మామూలుగా లేదుగా

Edited By:

Updated on: Apr 25, 2026 | 12:10 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు 'వారణాసి' ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్‌తో ఉన్నారు. అయితే, ప్రియాంక చోప్రా 'సిటాడెల్‌' సీక్వెల్, పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఖలీఫా' విడుదల ప్రకటనలతో ఇతర స్టార్లు తమ తదుపరి ప్రాజెక్ట్‌లను చురుకుగా ప్రమోట్ చేస్తున్నారు. 'వారణాసి' ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నప్పటికీ, పరిశ్రమలో ఇతర కీలక ప్రాజెక్ట్‌ల సందడి కొనసాగుతోంది. మహేష్ నిబద్ధత, ఇతర తారల బహుళ ప్రాజెక్ట్‌ల వ్యూహాన్ని ఇది హైలైట్ చేస్తుంది.

ఫోకస్‌.. ఫోకస్‌ అంటూ సింగిల్‌ పాయింట్‌ అజెండాతో ఉన్నారు సూపర్‌ స్టార్‌ మహేష్‌. కానీ, నిత్యం ఆయనతో కనిపించేవారు మాత్రం సందర్భం దొరికిన ప్రతి సారీ పక్క ప్రాజెక్టులు కూడా చేసుకుంటున్నారు. వచ్చే ఏడాదిదాకా వెయిట్‌ చేయమని మహేష్‌ చెబుతుంటే, మేం మధ్యలోనే వచ్చేస్తున్నామని హింట్‌ ఇస్తున్నదెవరు? ఇప్పుడు వరల్డ్ వైడ్‌ ట్రెండ్‌ అవుతోంది వారణాసి. మెక్సికోలో థండర్‌ స్టేజ్‌ మీద ఫస్ట్ గ్లోబల్‌ అప్పియరెన్స్ అంటూ వరల్డ్ వైడ్‌ ట్రెండ్‌ అవుతోందీ ప్రాజెక్ట్. వారణాసి టు ద వరల్డ్ ని విట్‌నెస్‌ చేయడానికి మేం అందరం వెయిటింగ్‌ అంటున్నారు ఇంటర్నేషనల్‌ ఆడియన్స్. మీరందరూ వారణాసి టు ద వరల్డ్ ని విట్‌నెస్‌ చేసిన ఆనందంతో మా ప్రాజెక్టుల మీద కూడా ఓ లుక్‌ వేసేయండి అని అంటున్నారు వారణాసి ఆర్టిస్టులు. వారణాసి నెక్స్ట్ ఇయర్‌ సందడి చేస్తుంది.. అంతకన్నా ముందు నేను సిటాడెల్‌ సీక్వెల్‌తో హలో చెప్పేస్తానని తన వంతు మాటిచ్చేస్తున్నారు ప్రియాంక చోప్రా. ప్రియాంక సిటాడెల్‌ చూసిన కళ్లతో, మా ఖలీఫాని కూడా చూసేయండని ఓపెన్‌ గా చెప్పేస్తున్నారు పృథ్విరాజ్‌ సుకుమారన్‌. ఓనమ్‌ సందర్భంగా ఆగస్టు 20న ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఇందులో ఆమీర్‌ అలీ అనే గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు పృథ్విరాజ్‌. రివెంజ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. మలయాళ అగ్రహీరో మోహన్‌లాల్‌ ఇందులో కీ రోల్‌ చేస్తున్నారు. రాజమౌళి అండ్‌ కార్తికేయ కూడా ఏదో ఒక ప్రాజెక్టుతో క్లబ్‌ అయ్యి, ఎక్కడో ఓ చోట ఫ్లాష్‌ అవుతూనే ఉన్నారు. కానీ, మా హీరో మాత్రం డెడికేషన్‌ కా బాప్‌ అన్నట్టు.. వారణాసికి మాత్రమే కమిట్‌ అయి ఉన్నారు. దటీస్‌ అవర్‌ బాబూ అని ఒకింత గర్వంగానే చెప్పుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్కింటి వారి వల్ల నిద్ర కరువైంది.. అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీ పై ఫిర్యాదు

చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..

ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు

ఏపీలో కొత్తగా 1.5 లక్షల పింఛన్లు !! దరఖాస్తులు తీసుకునేది ఎప్పటి నుంచి అంటే…?

దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా

Follow Us