Unstoppable Season 4: బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!

Updated on: Oct 20, 2024 | 11:07 AM

సినిమాల్లోనే కాదు.. ఓటీటీ ఎంట్రీతో కూడా తన మార్క్‌ వైబ్రేషన్స్ క్రియేట్‌ చేసిన స్టార్ నందమూరి బాలయ్య. ఓ పక్క తన సినిమాలతో కలెక్షన్లు కుమ్మేస్తున్న బాలయ్య.. ఇంకో పక్క అన్‌స్టాపబుల్ షో.. చేస్తూ.. స్ట్రీమింగ్ మినెట్స్‌లో సెన్సేషనల్ అయ్యారు. ఓటీటీ ఫీల్డ్ లోనే.. ఆహా అనేంత క్రేజ్‌ సంపాదించుకున్నారు. తన హోస్టింగ్ స్టైల్‌తో.. అన్‌ స్టాపబుల్ షోతో.. అన్‌ స్టాపబుల్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తూనే వెళుతున్నారు.

బాలయ్య మరో సారి అన్‌ స్టాపబుల్‌గా సీజన్‌4తో మన ముందుకు వస్తున్నారు. అయితే ఈ సారి తన షోను.. పొలిటికల్ ఫీల్డ్‌ లో సూపర్ స్టార్ లాంటి ఓ నాయకుడితో బిగిన్ చేయబోతున్నారు. సిల్వర్ స్క్రీన్‌ పై డైలాగులతో దుమ్ముదులపడం.. థియేటర్‌ను షేక్‌ చేయడం.. తన పేరునే అందరూ జపించేలా చేయడం.. బాలయ్య సొంతం. ఇక ఓ రాష్ట్రాన్ని ముందుకు నడపడం.. అదునాతన టెక్నాలిజీని అడాప్ట్ చేసుకుకుని పరిపాలన సాగించడం.. నారా చంద్ర బాబు నాయుడి సొంతం. ఎట్ ప్రజెంట్ ఏపీ సీఎంగా తన మార్క్‌ పాలన సాగిస్తున్న ఆయనే.. అన్‌స్టాపబుల్ సీజన్ 4కు వస్తున్నారు. బాలయ్యకు మరో సారి సరదా సరదా కబుర్లు చెప్పబోతున్నారు. ఫన్నీ టాస్క్‌లు ఆడి కాసేపు తనలోని మరో కోణాన్ని మనకు చూపించబోతున్నారు.

ఇక గతంలోనూ అన్ స్టాపబుల్ సీజన్ 2కు వచ్చిన బాలయ్య.. అప్పుడు చాలా విషయాలు పంచుకున్నారు. తన పర్సనల్ .. ప్రొఫెషనల్ విషయాల గురించి మాట్లాడారు. బాలయ్య కూడా చంద్రబాబు నాయుడిని ఇరుకు న పెట్టే ప్రశ్నలతో .. నవ్వులు పూయించే రొమాంటిక్ ప్రశ్నలను సంధించారు. జవాబు రాబట్టారు. మరి ఈ సారి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో.. ఏపీ సీఎం.. వాటిని ఏం ఆన్సర్ ఇస్తారో చూడాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 20, 2024 09:09 AM
Loading...
Unable to load recommendations.
Follow Us