అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..

Updated on: Apr 22, 2025 | 3:36 PM

బిగ్ బాస్! తెలుగులో నెంబర్ వన్ రియాల్టీ షో..! సెలబ్రిటీలందర్నీ కొన్ని రోజులు ఒక హౌస్‌లో సీల్‌ చేసి... ఎంటర్‌టైన్మెంట్ టాస్కులు చేయించే ఈ షోకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం తెగ ప్రయత్నిస్తుంటారు. కానీ తాను మాత్రం ఇక ఈ షోకు వెళ్లనంటూ తెగేసి చెబుతున్నారు సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ.

అందుకు ఒక రకంగా కారణంగా తన భర్త అమర్‌దీపక్ కూడా అంటూ చెప్పి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. కొన్ని రోజుల ముందు నుంచి.. తేజస్విని గౌడ ఈసారి బిగ్ బాస్ రియాల్టీ షోలోకి వెళ్లే ఛాన్స్ అందుకుందని.. త్వరలో రాబోయే సీజన్ కు వెళ్లనుందనే టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని బిగ్ బాస్ షోకు వెళ్లడం పై క్లారిటీ ఇచ్చారు. తనకు లాస్ట్ టైం కూడా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందని.. మీటింగ్ కు కూడా వెళ్లి వచ్చానని చెప్పారు. అంతకు ముందు వెళ్దాం అనుకున్నప్పటికీ అమర్ దీప్ బిగ్ బాస్ షోకు వెళ్లొచ్చిన తర్వాత.. తనకు అంతగా ఇంట్రెస్ట్ లేదన్నారు. బిగ్ బాస్‌ కు వెళ్లనంటూ చెప్పారు తేజస్విని గౌడ. అంతేకాదు అమర్ వెళ్లినప్పుడు కూడా తనను అడిగారని.. అప్పుడు తనకు సీరియల్స్ ఉండడంతో కుదరలేదని తేజస్విని చెప్పారు. గతేడాది కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్లలేదని.. ఇకపై వెళ్లను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ డెసీషన్‌ తీసుకోవడం వెనక.. బలమైన కారణమే ఉందంటున్నారు ఫ్యాన్స్. బిగ్ బాస్ టైంలో.. తన భర్త అమర్‌ దీప్‌ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగిందని.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌ కూడా అమర్ ఫ్యామిలీ ఉన్న కార్‌పై.. దాడి చేశారని.. దీంతో బిగ్ బాస్ షోకు వెళ్లకపోవడమే బెటర్ అంటూ… ఈమె థింక్ చేస్తున్నారని గెస్ చేస్తున్నారు ఈమె ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పక్షిలో సగం ఆడ, సగం మగ లక్షణాలు

ప్రపంచంలోనే అరుదైన ‘గోల్కొండ బ్లూ’ వజ్రం వేలం..

17 మంది డాక్టర్లు గుర్తించలేకపోయిన జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది

వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్‌

ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది..? సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యం