Trisha: ‘పెళ్లైంది.. పిల్లలు కూడా ఉన్నారు’ మరి విజయ్ సంగతేంటి ??
త్రిషపై వస్తున్న గాలి వార్తలపై నటి తీవ్రంగా స్పందించారు. నెటిజన్లతో పాటు రాజకీయ నాయకులు కూడా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా పుకార్లు ప్రచారం చేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సెటైరికల్‌గా పోస్ట్ పెట్టి, తనపై వస్తున్న అన్ని వార్తలను ఖండించారు. అయితే, విజయ్ దళపతితో ఎఫైర్ రూమర్‌పై ఆమె మౌనంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
త్రిష పై గాలి వార్తలు రావడం కొత్త కాదు.. కానీ ఈ గాలి వార్తలపై ఆమె కాస్త గట్టిగా రియాక్టవ్వడం, కొత్తగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న విషయం. అంతకు ముందు ఒక్క నెటిజన్లు మాత్రమే త్రిష పై లేని పోని గాసిప్స్ అల్లేవారు. వాటిని ప్రచారంలోకి తెచ్చేవారు. కానీ ఇప్పుడు విజయ్ దళపతి పుణ్యమాని పొలిటికల్ నేతలు కూడా.. త్రిష పై వస్తున్న గాలి వార్తలను వేలెత్తి చూపుతున్నారు. వీలైతే వాళ్లు కూడా నాలుగు మాటలు యాడ్ చేసి.. త్రిష ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో త్రిషకు కోపం తెప్పిస్తున్నారు. తన చుట్టూ.. తన ప్రమోయం లేకుండ, ఇలా వినిపిస్తున్న గాలి వార్తలను వింటున్న త్రిష.. అన్నింటిపై .. ఉన్నట్టుండి ఒక్కసారిగా.. సెటైరికల్‌గా బ్లాస్ట్ అయ్యారు. నేను సినిమాలకు గుడ్ డై చెప్పేశాను… రిచ్ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకున్నాను.. రెండేళ్లు నిండిన నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.. ఈ రోజుకు ఈ గాసిప్స్ చాలా.. లేక ఇంకేమైనా యాడ్ చేయాలా? అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు త్రిష. తన పోస్ట్‌తో.. తన పై వినిపిస్తున్న అన్ని వార్తలను ఖండించేశారు. అయితే విజయ్‌తో ఎఫైర్ రూమర్‌ను మాత్ర త్రిష్ మెన్షన్ చేయకపోవడాన్ని.. ఆ రూమర్ పై రియాక్టవ్వకపోవడాన్ని కొంత మంది నెటిజన్లు ఎత్తి చూపుతున్నారు. ఆ వార్త ఈమెకు ఎందుకు వినిపివ్వలేదంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
