వివాదంలో త్రిష..అసలు తప్పెవరిది..?

Updated on: May 06, 2026 | 11:32 AM

సూర్య కరుపు సినిమా ఆడియో లాంచ్‌కు త్రిష హాజరుకాకపోవడంపై వివాదం రాజుకుంది. తనకు ఆహ్వానం అందకపోవడమే కారణమని త్రిష పరోక్షంగా, వ్యంగ్యంగా స్పష్టం చేశారు. ఆమెపై విమర్శలు, మద్దతు పెరుగుతుండగా, చిత్ర యూనిట్, త్రిష మధ్య కమ్యూనికేషన్ లోపం సినిమాకు ఉచిత ప్రచారం కల్పిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుపు సినిమా ఆడియో లాంచ్ ఇటీవల జరిగింది. అయితే, ఈ వేడుకకు హీరోయిన్ త్రిష హాజరుకాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సినిమా చేస్తారు కానీ ప్రమోషన్లకు రాలేదని ఆమెపై మొదట విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, ఈ వివాదం వెనుక ఓ ఊహించని ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. కరుపు ఆడియో వేడుకకు త్రిష రాకపోవడానికి ప్రధాన కారణం చిత్ర బృందం నుంచి ఆమెకు ఆహ్వానం అందకపోవడమే అని సమాచారం. ఈ విషయాన్ని త్రిష తనదైన శైలిలో పరోక్షంగా, సెటైరికల్‌గా స్పష్టం చేశారు. ఓ నెటిజన్ “ఈ సినిమాలో మీరు ఉన్నారా?” అని అడగగా, “నేను మర్చిపోయాను, బహుశా నా ఆహ్వానం మెయిల్‌లో మిస్ అయి ఉండవచ్చు” అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్

టాలీవుడ్‌ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్

ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్

Follow Us