TOP 9 ET: NTR Vs కమల్ హాసన్.. | అదిపోయేలా.. రామ్ చరణ్ బేబీ రూమ్.

|

Jul 14, 2023 | 9:45 PM

బేబీ సినిమా టీమ్‌ని అప్రిషియేట్ చేశారు హీరో విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా ప్రీమియర్‌ షోకి హాజరయ్యారు ఆయన. విజయ్‌ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన సినిమా బేబీ ఇవాళ విడుదలైంది. ప్రేమలో నిజాయతీ ఉండటమే తన దృష్టిలో మాస్‌ అని, అది బేబీ మూవీలో చాలా ఉందని అన్నారు హీరో ఆనంద్‌ దేవరకొండ కొండ.

01.Tarak
దేవర సినిమాతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను.. లోక నాయకుడు కమల్ హాసన్ ఢీకొట్టబోతున్నారట. ఎస్ ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలో.. లోకనాయకుడినే విలన్ గా అనుకుంటున్నారట మేకర్స్. అందుకు కమల్ కూడా ఓకే చెప్పారని.. కోలీవుడ్‌ లో బిగ్ టాక్. ఇక ఇదే కనుక నిజం అయితే.. వీరి డ్యూయో.. సిల్వర్ స్క్రీన్‌ను బద్దలయ్యేలా చేయడం ఖాయమే కదా..”!

02.Ram charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అండ్ ఉపాసన తమకు పుట్టిన బేబీ క్లిన్‌ కారా రూమ్‌ను తాజాగా డిజైన్ చేస్తున్నారు. ఫారెస్ట్ బేస్డ్ థీమ్‌తో.. లైట్‌ కలర్స్‌తో.. ఆ రూమ్‌ను చాలా అందంగా డిజైన్ చేస్తున్నారు. డిజైన్ చేయడమే కాదు.. తమ బేబీ హ్యాపీగా.. హాయిగా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తు తీసుకుంటున్నారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో చెప్పారు ఉపాసన.. చెప్పడమే కాదు.. రూమ్ డెకరేషన్ తాలూకూ.. వీడియోను కూడా తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేశారు.

03.vijay devarakonda
బేబీ సినిమా టీమ్‌ని అప్రిషియేట్ చేశారు హీరో విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా ప్రీమియర్‌ షోకి హాజరయ్యారు ఆయన. విజయ్‌ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన సినిమా బేబీ ఇవాళ విడుదలైంది. ప్రేమలో నిజాయతీ ఉండటమే తన దృష్టిలో మాస్‌ అని, అది బేబీ మూవీలో చాలా ఉందని అన్నారు హీరో ఆనంద్‌ దేవరకొండ కొండ. విజయ్‌తో పాటు రాశీఖన్నా కూడా ప్రీమియర్‌ షోకి అటెండ్‌ అయ్యారు.

04.Samantha
రాజ్‌ డీకే తనకోసం ఇంకో మంచి పాత్ర రాసేవరకూ ఇప్పటిదాకా చేసిన సిటాడెల్‌ కేరక్టర్‌ తన కెరీర్‌లో బెస్ట్ అని అన్నారు సమంత. దీన్ని బట్టి ఆమె సినిమాల్లో టెంపరరీ బ్రేక్‌ మాత్రమే తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. తనకు అన్ని వేళలా రాజ్‌, డీకే మద్దతిచ్చారని సమంత తెలిపారు. ఫ్యామిలీమేన్‌ థర్డ్ చాప్టర్‌ ఉంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే సమంత ఎప్పుడు జాయిన్‌ అవుతారన్నదాని మీద క్లారిటీ లేదు.

05. Ada kamal
ది కేరళ స్టోరీకి సంబంధించి కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు నటి అదా శర్మ. విమర్శించిన వారు ఆ సినిమాను చూసి ఉండరని అన్నారు. మన దేశంలో ఉన్న వాక్‌ స్వతంత్రాన్ని తలచుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఎవరు ఎవరి గురించైనా మాట్లాడవచ్చు. ఎవరి దృష్టికోణం వారిది. దాన్ని గౌరవిస్తున్నాను. నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని అన్నారు అదా శర్మ.

06.tamanna
తమన్నా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఉత్తరాదిన రీసెంట్‌గా ఓ సినిమాకు ఓకే చెప్పారు. జాన్‌ అబ్రహమ్‌ పక్కన వేదా మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. జాన్‌తో తాను మొదటిసారి పనిచేస్తున్నానని అన్నారు తమన్నా. ఈ మూవీ సెట్స్ కి వెళ్లడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతోంది వేద.

07.Ankitha
విజయేంద్ర వర్మ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానని అన్నారు నాయిక అంకిత. ఆ సినిమా సక్సెస్‌ అయి ఉంటే, ఇండస్ట్రీలో ఉండేదాన్ని అని అన్నారు. ఆ సినిమా ఆడలేదని చెప్పారు. అందుకే కెరీర్‌ని వదిలిపెట్టినట్టు తెలిపారు. ముంబయ్‌కి చెందిన వ్యాపారవేత్త విశాల్‌ జగపతితో 2016లో పెళ్లయింది అంకితకు. ఈ దంపతులు న్యూజెర్సీలో స్థిరపడ్డారు.

08. udayanidhi
నాయకుడు తన చివరి సినిమా అని అన్నారు హీరో ఉదయనిధి స్టాలిన్‌. సామాజిక న్యాయం గురించి నాయకుడులో చర్చించామని అన్నారు. పొలిటికల్‌ డ్రామాగా సాగినప్పటికీ, మంచి ఎమోషనల్‌ డ్రైవ్‌ ఉన్న సబ్జెక్ట్ అని, సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కిందని అన్నారు ఉదయనిధి. యూనివర్శల్‌ అప్పీల్‌ ఉన్న ఈ కథ తప్పకుండా తెలుగువారికి నచ్చుతుందని చెప్పారు.

09.Ramayanam
తాను తెరకెక్కించబోయే రామాయణం గురించి మాట్లాడారు డైరక్టర్‌ నితీష్‌ తివారి. వివాదాల లేని రామాయణం తీస్తానని అన్నారు. తనకు రామాయణం మీద సంపూర్ణ అవగాహన ఉందని, నటీనటుల గురించి త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. నితీష్‌ తివారి రామాయణంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతమ్మగా ఆలియా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...