TOP 9 ET: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న భోళా ఫోక్ సాంగ్..| ఎయిడ్స్‌తో స్టార్ హీరోయిన్ మృతి.
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా గాండీవధారి అర్జున. యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు. ఇందులో స్పైగా నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలతో పాటు మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
01.Bholaa
మెగాస్టార్ చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ భోళా శంకర్ మూవీ నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్..తాజాగా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. స్వర సాగర్ కంపోజిషన్లో.. ఫోక్ బీట్‌గా యూట్యూబ్‌ను హిట్ చేసిన ఈ సాంగ్.. రిలీజ్ అయిన 24గంటల్లోనే దాదాపు 5.1 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లోనూ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.
02.Nisha Noor
80స్‌లో సౌత్ ఇండియన్ గ్లామర్ క్వీన్‌గా.. ఫిల్మ్ ఇండస్ట్రీస్‌నే ఏలిన నిషా నూర్ జీవితం మరో సారి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకానొకదశలో.. సినిమాలు లేక వక్ర మార్గం పట్టిన ఈ హీరోయిన్.. బతకడం కోసం.. వ్యభిచారిగా మారి.. చివరికి ఎయిడ్స్‌తో మరణించింది. అయితే ఆమె ఎయిడ్స్‌తో బక్కచిక్కిన ఫోటోలు.. సిల్వర్ స్క్రీన్‌ను ఏలిన ఫోటోలు .. ఎందులో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అందర్నీ ఈ హీరోయిన్‌ను గుర్తుకు తెచ్చుకుంటూ.. పాపం అనేలా చేస్తున్నాయి.
03.Game Changer
శంకర్ మరోసారి గేమ్ ఛేంజర్ సెట్‌కు వచ్చేసారు. జులై 11నే హైదరాబాద్‌లో ఈ సినిమా షెడ్యూల్ మొదలైంది. ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. తాజాగా ఇంటర్వెల్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు ట్వీట్ చేసారు శంకర్. ఈ సీక్వెన్స్ అంతా అద్భుతంగా వస్తున్నట్లు తెలిపారు శంకర్. గత వారం వరకు ఆయన కమల్ హాసన్ ఇండియన్ 2తో బిజీగా ఉన్నారు.
04.Sanajavaragamana
శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు తెరకెక్కించిన సినిమా సామజవరగమనా. ఈ సినిమాకు సెన్సేషనల్ కలెక్షన్లు వస్తున్నాయి. 12 రోజుల్లోనే ఏకంగా 40 కోట్లకి పైగా వసూళ్లు తీసుకొచ్చింది ఈ చిత్రం. అలాగే యుఎస్‌లోనూ ఎక్కడా తగ్గట్లేదు సామజవరగమనా. అక్కడ ఇప్పటికే ఈ చిత్రం 9 లక్షల డాలర్స్‌కు పైగా వసూలు చేసి 1 మిలియన్ వైపు పరుగులు తీస్తుంది. కచ్చితంగా మూడో వీకెండ్‌లో ఈ మ్యాజిక్ ఫిగర్ అందుకుంటుందని నమ్ముతున్నారు చిత్రయూనిట్.
05.Gandeevadhari Arjuna
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా గాండీవధారి అర్జున. యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు. ఇందులో స్పైగా నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలతో పాటు మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది.
06.Nani
తన నెక్ట్స్ సినిమా అప్‌డేట్ రాబోతుందన్న విషయాన్ని ఇంట్రస్టింగ్‌గా రివీల్ చేశారు నేచురల్ స్టార్ నాని. శౌర్యు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ జూలై 13న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. నాని పారాచ్యుట్‌తో ఆకాశంలో విహరిస్తూ ఈ ఎనౌన్స్‌మెంట్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
07.Vijay
తమిళ హీరో విజయ్ నిన్నమొన్నటి వరకు లియో షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అలా పూర్తి కాగానే ఇలా ఫ్యాన్స్ మీట్‌తో బిజీ అయిపోయారు. అయితే త్వరలోనే ఈయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయ్ నెక్ట్స్ సినిమా వెంకట్ ప్రభుతో కమిట్ అయ్యారు. దీని తర్వాత శంకర్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇది భారీ పొలిటికల్ డ్రామాగా ఉండనుందని తెలుస్తుంది. గతంలో నమ్బన్ సినిమా ఈ కాంబినేషన్‌లోనే వచ్చింది. తెలుగులో అదే స్నేహితుడు పేరుతో వచ్చింది.
08.The Ghost
కన్నడ నట చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ సినిమా ది ఘోస్ట్ టీజర్ విడుదల చేసారు మేకర్స్. బీర్బల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన శ్రీని దీనికి దర్శకుడు. ఘోస్ట్ నుంచి తాజాగా బిగ్ డాడీ టీజర్ అంటూ డా. శివరాజ్ కుమార్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. బిగ్ డాడీ ఆఫ్ ఆల్ మాసెస్ అంటూ అందులో రాసుకొచ్చారు. తానే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటూ శివన్న చెప్పిన డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. సినిమా దసరాకు విడుదల కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...