TOP 9 ET: OG వరల్డ్ రికార్డ్‌..! థియేటర్‌ను అల్లకల్లోలం చేసిన పవన్‌ ఫ్యాన్స్‌.. వీడియో.

|

Sep 03, 2023 | 11:16 AM

ఓ పక్క డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ సలార్ మాసం మొదలైందంటూ.. ఖుషీ అవుతున్న వేళ.. అందరికీ బిగ్ పంచ్ తగిలింది. ప్రభాస్‌ సలార్ మూవీ రిలీజ్‌, పోస్ట్ అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అన్‌అఫీషియల్‌గా అఫీషియల్ అవుతోంది. అకార్డింగ్ టూ ఫిల్మ్ అనలిస్ట్స్‌ రిపోర్ట్స్ అండ్ ట్వీట్స్ .. ప్రభాస్ సలార్ మూవీ సెప్టెంబర్ 28 డేట్‌ నుంచి తప్పుకుందట. డైరెక్టర్ ప్రశాంత్ నీలే ఈ మూవీ ఫైనల్ గ్రాఫిక్స్ పై అంత సాటిఫై లేకపోవడంతో..

01.Pawan
ఎన్నో అంచనాల మధ్య మరెందరో ఎదురుచూపుల మధ్యలో రిలీజ్ అయిన హంగ్రీచీతా టీజర్‌ పవన్‌ ఫ్యాన్స్‌లో పూనకాలు పుట్టిస్తూనే.. యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. ఇక దాంతో పాటే.. నెవర్‌ బిఫోర్ అన్నట్టు.. వరల్డ్ రికార్డ్ ఇదే అన్నట్టు ఓ రేర్‌ ఫీట్‌ ను అచీవ్ చేసింది. ఎస్ ! యూట్యూబ్‌లో రిలీజ్ ఈ టీజర్‌ .. రిలీజ్ అయిన మూడు గంటల్లోనే దాదాపు 500కె లైక్స్‌ అంటే ఐదు లక్షల లైక్స్‌ను వచ్చేలా చేసుకుంది. టాలీవుడ్ హిస్టరీలోనే ఇన్ని లక్షల ఫాస్టెస్ట్ లైక్స్ తెచ్చుకున్న సినిమాగా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో పాటే హిస్టరీ కెక్కింది పవర్ స్టార్ ఓజీ.

02.Pawan
టాలీవుడ్ లో అందరి హీరోలకు.. ఫ్యాన్స్ ఉంటే.. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్కు మాత్రం భక్తులుంటారు. ఆయనంటే పడ చస్తుంటారు. ఆయనకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని వేడుక చేసుకుంటూ ఉంటారు. ఇక ఎట్ ప్రజెంట్ అదే చేశారు. పవన్‌ బర్త్‌ డే సందర్భంగా.. హైద్రాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో.. పవన్ ఓజీ టీజర్‌ రిలీజ్ అవుతున్న వేళ.. థియేటర్లలోకి వెళ్లువలా వచ్చి చేరారు ఓజీ ఫ్యాన్స్! వచ్చి చేరడమే కాదు.. వర్జినల్ గ్యాంగ్ స్టర్ అవతార్‌ను..సిల్వర్ స్క్రీన్‌ పై విట్ నెస్ చేశారు. థియేటర్లోని డాల్బీ అట్మాస్ సౌండ్‌ను కూడా డామినేట్ చేస్తూ.. పవర్ స్టార్ ఓజీ లుక్‌ను చూసి అరిగిచిగీపెట్టారు. థియేటర్‌ టాప్‌ లేచిపోయేలా చేశారు.

03.Prabhs
ఓ పక్క డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ సలార్ మాసం మొదలైందంటూ.. ఖుషీ అవుతున్న వేళ.. అందరికీ బిగ్ పంచ్ తగిలింది. ప్రభాస్‌ సలార్ మూవీ రిలీజ్‌, పోస్ట్ అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అన్‌అఫీషియల్‌గా అఫీషియల్ అవుతోంది. అకార్డింగ్ టూ ఫిల్మ్ అనలిస్ట్స్‌ రిపోర్ట్స్ అండ్ ట్వీట్స్ .. ప్రభాస్ సలార్ మూవీ సెప్టెంబర్ 28 డేట్‌ నుంచి తప్పుకుందట. డైరెక్టర్ ప్రశాంత్ నీలే ఈ మూవీ ఫైనల్ గ్రాఫిక్స్ పై అంత సాటిఫై లేకపోవడంతో.. మళ్లో సారి గ్రాఫిక్ కరెక్షన్స్ కోసం ఈ మూవీని పంపాలని డిసైడ్ అయ్యారట. దీంతో ఈ సినిమా అందరూ అనుకున్నట్టు.. మేకర్స్ చెప్పినట్టు.. సెప్టెంబర్ 28కి వచ్చే అవకాశమే లేదని ఇన్‌సైడ్ టాక్.

04.Kushi Vijay
ఇక ఖుషీ సినిమా హిట్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఈ సినిమా కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ కూడా బద్దలు కొట్టేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీతో… డే 1 వరల్డ్ వైడ్‌ ఏకంగా 30.1 క్రోర్ గ్రాస్‌ వచ్చేలా చేసుకుని.. మరో సారి తన కలెక్షన్స్ స్టామినా ఏంటో అందరికీ చూపించారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న తన ఫ్యాన్స్‌ ను ఎట్టకేలకు కాలర్ ఎగరేసేలా చేశారు.

05.Jailer
రజనీకాంత్‌ హీరోగా నటించిన సినిమా జైలర్‌. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈమూవీ బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో.. ఈ మూవీ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ రజినీతో పాటు డైరెక్టర్ నెల్సర్ దిలీజ్ కు లగ్జరీ కార్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు. తన గిఫ్ట్ గివింగ్ నేచర్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

06.wAR2
హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా వార్‌2. ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్‌ నుంచి మొదలవుతుంది. అయాన్‌ ముఖర్జీ డైరక్ట్ చేస్తున్నారు. 2025 రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కియారా నాయిక.

07.RASHMIKA
తన పెళ్లికి ఇంకా చాలా టైమ్‌ ఉందని అంటున్నారు నాయిక రష్మిక మందన్న. బాలీవుడ్‌లోనూ, దక్షిణాదిన వరుస అవకాశాలతో బిజీగా ఉన్నానని అన్నారు. ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదని చెప్పారు. యానిమల్‌, పుష్ప2, రెయిన్‌బోతో పాటు ధనుష్‌ మూవీలో కేరక్టర్‌ కూడా చాలా బావుంటుందని అన్నారు.

08.samantha
ఖుషీ సినిమా విడుదలకు ముందు తాను చాలా ఒత్తిడికి గురయ్యానని అన్నారు నటి సమంత. రిలీజ్‌ తర్వాత ఎంతో హ్యాపీగా ఉన్నానని చెప్పారు. జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే ఓ కల నిజమైన క్షణమిది అని అన్నారు. అండ్ ఖుషి సక్సెస్‌ అయిన వేళ.. తనకొస్తున్న మెసేజెస్‌ అండ్ విషెస్‌తో బిజీగా ఎట్ ప్రజెంట్ క్లౌడ్‌ నైన్‌లో విహరిస్తున్నారు సామ్‌.

09.Balayya
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా భగవంత్‌ కేసరి. ఇక మేకర్స్ చెప్పినట్టే.. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గణేష్‌ ఆంథమ్‌ సాంగ్ అంరద్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మాస్ బీట్లో సాగుతూ.. యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..