TOP9 ET: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ2’ | డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్‌కు షాకింగ్ కలెక్షన్స్!
తాజాగా కేంద్రం 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. అందులో ఉత్తమ తెలుగు చిత్రంగా నిఖిల్ యాక్ట్ చేసిన కార్తికేయ2 నిలిచింది. ఇక 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడులైన.. 300 పైగా సినిమాలను పరిశీలించిన నేషనల్ అవార్డ్ జ్యూరీ..అందులో కొన్ని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. ఇక అందులోనే ఉత్తమ తెలుగు చిత్రంగా.. కార్తికేయ2 నిలవగా.. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2, తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1,
01.karthikeya: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ2’కు జాతీయ అవార్డ్.!
తాజాగా కేంద్రం 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. అందులో ఉత్తమ తెలుగు చిత్రంగా నిఖిల్ యాక్ట్ చేసిన కార్తికేయ2 నిలిచింది. ఇక 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడులైన.. 300 పైగా సినిమాలను పరిశీలించిన నేషనల్ అవార్డ్ జ్యూరీ..అందులో కొన్ని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. ఇక అందులోనే ఉత్తమ తెలుగు చిత్రంగా.. కార్తికేయ2 నిలవగా.. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2, తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, హిందీ చిత్రంగా గుల్ మొహర్ అవార్డ్ దక్కింది.
02.ram charan: రామ్ చరణ్‌ను ఆకాశానికెత్తిన హాలీవుడ్ స్టార్ హీరో.
ట్రిపుల్ ఆర్ సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌తో గ్లోబల్ రేంజ్ ఐడెంటినే కాదు.. గ్లోబల్ రేంజ్ ఫ్యాన్ డమ్‌ను కూడా సంపాదించుకున్నాడు రామ్ చరణ్. అంతేకాదు ఈ ఒక్క సినిమాతో.. హాలీవుడ్ సెలబ్రిటీలను ఆకట్టుకున్నాడు.. తన గురించి వారు బాహాటంగా మాట్లాడేలా .. మెచ్చుకునేలా చేశారు. అయితే హాలీవుడ్ స్టార్ హీరో లూకాస్ బ్రావో కూడా ఎట్ ప్రజెంట్ ఇదే చేశారు. తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఎమిలీ ఇన్ పారిస్’ సినిమా ప్రమోషన్లో రామ్ చరణ్ గురించి మాట్లాడారు. ట్రిపుల్ ఆర్‌లో చరణ్ ఎంట్రీ సీన్.. యాక్టింగ్.. సూపర్ అంటూ ఆకాశానికెత్తాడు.
03.pawan kalyan: హరి హర యాక్షన్ బిగెన్స్ రంగంలోకి దిగుతున్న డిప్యూటీ సీఎం.
ఓ పక్క ఏపీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. వీలు దొరికినప్పుడల్లా.. సినిమాలు చేయడానికి ట్రై చేస్తానంటూ ఇప్పటికే చెప్పారు. ఇక ఇప్పుడు షూటింగ్‌లకు కూడా వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక దీన్నే కన్ఫర్మ్ చేస్తూ.. తాజాగా హరిహర వీరమల్లు టీం నుంచి ఓ బిగ్ న్యూస్ బయటికి వచ్చింది. 400 నుంచి 500 మందితో మొదలయ్యే భారీ యాక్షన్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోనున్నట్టు మేకర్స్ నుంచి అఫీషియల్ ఇన్ఫో అందింది. ఇదే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూనే పవన్ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
04.hareesh: స్టెప్పు విషయంలో మొహమాటానికి పోయి.. అడ్డంగా బుక్కైన హరీష్.!
ఓ డైరెక్టర్ తన టీం నుంచి తనకు కావాల్సింది తీసుకుంటాడు. తన సినిమాను.. తనకు నచ్చినట్టుగా మలుచుకుంటాడు. కానీ మొహమాటాలకు పోయి తలనొప్పులు తెచ్చుకోడు. అయితే డైరెక్టర్ హరీశ్ శంకర్ మాత్రం ఇదే చేశాడని కొంత మంది నెటిజన్లు ఫీలవుతున్నారు. ఆఫ్టర్ మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్.. ఆ సినిమాలోని సితార సాంగ్‌లో ఓ స్టెప్ కాస్త వల్గర్‌గా, ఉమెన్‌ను ఆబ్జెక్టిఫైయింగ్ చేసేలా ఉందని కొంత మంది నెటిజన్స్ అండ్ ట్రోలర్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. దీంతో తాజాగా ఆ ట్రోలర్స్‌కి ఆన్సర్ ఇచ్చారు హరీశ్. తనకు కూడా ఆ స్టెప్ అవసరం లేదనే అనిపించిందని.. కానీ శేఖర్ మాస్టర్‌ను చిన్న బుచ్చలేక .. ఫస్ట్ డే షూట్ కావడంతో.. ఆయన కంఫ్టర్ట్ కోసం ఆ స్టెప్‌ను లైట్ తీసుకున్నా.. అన్నట్టు ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు తన ఆన్సర్‌తో కూడా.. నెట్టింట ట్రోల్ అవుతున్నారు.
05. pawan: నాన్నతో వెళతానంది సరే వెళ్లమ్మా అని చెప్పా.!
పంద్రాగస్ట్ రోజు.. సెలబ్రిటీల జెండా వందనానికి సంబంధించిన ఫోటోలే కాదు తన కూతురితో పనవ్ తీసుకున్న సెల్పీ కూడా వైరల్ అయింది. అయితే వైరల్ అయిన ఈ ఫోటో గురించి ఆ ఫోటో బ్యాక్ స్టోరీ గురించి తాజాగా అందరికీ చెప్పింది రేణు దేశాయ్. పంద్రాగస్ట్ తన నాన్నతో కలిసి జరుపుకుంటానని ఆద్య కోరింది కాబట్టే తాను పంపించానంటూ చెప్పారు. అంతేకాదు అలా పంపడం వల్ల.. ఆద్య తన నాన్న తో టైం స్పెండ్ చేస్తుందని.. దాంతో పాటే కీలక హోదాలో ఉన్న వ్యక్తి ఎంత బిజీగా ఉంటారో ఆద్యకు తెలుస్తుందని.. ఏపీ ప్రజల కోసం తన తండ్రి చేస్తున్న సేవలు కూడా తన బిడ్డ తెలుసుకుంటుదని రేణు చెప్పారు.
06.pa ranjith: పేపర్ కప్పును కూడా వివాదం చేశారు కదరా.!
కాదేది కవితకు అనర్హం! కాదు కాదు..! కాదేది వివాదానికి అనర్హం! పా రంజిత్ టీ కప్పు విషయంలో నెట్టింట జరుగుతోంది ఇదే ఇది నిజం!
ఇక ఇప్పటికే ఓ వర్గం వారిని సపోర్ట్ చేస్తూ.. సినిమాలు చేస్తారనే పేరున్న పా రంజిత్.. రీసెంట్‌గా తంగలాన్ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. దాంతో పాటే ఈ మూవీ రిలీజ్ తర్వాత అంటరాని తనం గురించి మాట్లాడుతూ… పేపర్ కప్పులో టీం తాగడం కూడా అంటరానితనం కిందకే వస్తుందంటూ ఓ కామెంట్ చేశాడు. అంతే పా రంజిత్ అన్న ఈ ఒక్క మాటను పట్టుకుని నెట్టింట వివాదం క్రియేట్ చేశారు కొంత మంది నెటిజన్స్. పేపర్ కప్పుకు.. అంటరాని తనానికి సంబంధం ఏంటి సార్ అంటూ.. ప్రశ్నిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించే క్రమంలోనే పేపర్ కప్పులు వాడుతున్నారని.. ఈ చిన్న లాజిక్ మిస్ చేస్తే ఎలా అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పా ఫ్యాన్స్.. ఇది కూడా వివాదం చేశారు కదరా అంటూ కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు.
07.larence: లారెన్స్‌పై దారుణ ట్రోల్స్ అప్పుడప్పుడూ మంచి కూడా శాపమవుతుంది.
అతి మంచితనం కూడా.. అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు రాఘవ లారెన్స్ విషయంలో ఇదే జరిగింది. దివంగత స్టార్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ కొడుకు పడై తలైవన్ అనే సినిమాతో హీరోగా వస్తున్నారు. అయితే ఈ సినిమాలో తాను నటిస్తున్నా అంటూ అఫీషియల్‌గా చెప్పారు లారెన్స్. కానీ ఆ తర్వాత లారెన్స్ చేయాల్సి కార్యెక్టర్ తన తండ్రి చేస్తే బాగుంటుందని ఫీలైన కెప్టెన్ కొడుకు షణ్ముఖ పాండియన్ తన తండ్రిని ఏఐ టెక్నాలిజీతో రీక్రియేట్ చేసే ప్లాన్ చేశారు. ఇదే విషయం లారెన్స్ చెప్పి ఒప్పించారు. ఇక లారెన్స్ కూడా.. షణ్ముఖ పాండియన్ చెప్పిన ఐడియాను మెచ్చుకుని.. సినిమాలో తాను నటించకున్నా ప్రమోషన్స్ పాల్గొంటా అంటూ తన మంచి తనం చాటుకున్నాడు. అయితే ఇవేమీ తెలియని కెప్టెన్ ఫ్యాన్స్.. తమ హీరో కొడుకు సినిమాను లారెన్స్ రిజెక్ట్ చేశారంటూ నెట్టింట ఫైర్ అవుతున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
08. rishab shetti: నేషనల్ అవార్డ్ గెలిచిన రిషబ్ షెట్టి , నిత్యా మీనన్.!
కాంతార సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో షైన్ అవ్వడమే కాదు.. భాషతో సంబంధం లేకుండా ఇండియన్స్ ను ఇంప్రెస్ చేయడమే కాదు.. ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డ్‌ను ఎగరేసుకుపోయారు కన్నడ స్టార్ హీరో రిషబ్ షెట్టి. తాజాగా కేంద్రం అనౌన్స్ చేసిన 70వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్‌గా.. కాంతార సినిమాకు గాను ఎలక్ట్ అయ్యారు. అయితే ఈయన ఒక్కరే కాదు.. తిరు సినిమాకు గాను.. నటి నిత్యా మీనన్ తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డ్‌కు ఎలక్ట్ అయ్యారు రిషబ్. ఇక గత సంవత్సరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు గాను ఈ అవార్డ్ అందుకున్నారు.
09.tollywood: డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్‌కు షాకింగ్ కలెక్షన్స్.!
ఆగస్ట్ 15కి రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్స్ రెండు సినిమాలు తేలిపోయాయి. కలెక్షన్స్ విషయంలో డిస్సపాయింట్ చేశాయి. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్లో రవితేజ హీరోగా.. చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా డే 1 జస్ట్ 4.5 కోట్లు తెచ్చుకోగా… పూరీ రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమా దేశ వ్యాప్తంగా డే1 6.3 కోట్లు వసూలు చేసింది. అయితే లాంగ్ వీకెండ్ అయినా కూడా .. సినిమా రిలీజ్‌కు ముందు ఈ రెండు సినిమాలపై భారీగానే అంచనాలు ఉన్నా.. ఈ రేంజ్ కలెక్షన్స్‌కే ఈ రెండు సినిమాలు పరిమితం అవ్వడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.