సమ్మర్‌లో యాక్టివ్ కానున్న స్టార్ హీరోలు
వేసవి తీవ్రతను లెక్క చేయకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో, ప్రభాస్ కల్కి, ఫౌజీ, స్పిరిట్ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి చిత్రంపై సన్నాహాలు జరుగుతున్నాయి. 'కొత్త' అనే మంత్రంతో వీరు తమ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ముందడుగు వారి అంకితభావాన్ని చాటుతోంది.
కొత్త అనే పదంలోనే మేజిక్ ఉంటుంది. వినే వాళ్ల మనసుల్ని మెస్మరైజ్ చేస్తుందీ వర్డ్. అందుకే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే మీనమేషాలు లెక్కబెట్టడం లేదు మన స్టార్లు. ఎండలున్నాయా? మండుతున్నాయా? అని కూడా మనసుకు తీసుకోవడం లేదు. పదండి ముందుకు అని దూసుకుపోతున్నారు. స్టార్ హీరోల ఈ ముందడుగు గురించి మాట్లాడుకుందాం వచ్చేయండి… మెగాస్టార్ స్పీడ్ మామూలుగా లేదు. ఓ వైపు మనశంకరవరప్రసాద్‌గారు సినిమా సెలబ్రేషన్స్, మరోవైపు విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్స్… జస్ట్ ఇంతేనా అంటే.. వాట్ ఇంతే..? ఇంతే కాదు.. అంతకు మించి అనే ఆన్సర్ వినిపిస్తోందక్కడ. మెగాస్టార్ చిరంజీవి నయా ప్రాజెక్ట్ కి అన్ని రకాల రెడీ అయిపోయారు. హాట్ సమ్మర్‌లో బాబీ కోసం సెట్స్ కి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మెగాబాస్. ఏప్రిల్ నుంచి వీరి కాంబో మూవీ స్టార్ట్ కానుంది. వాల్తేరు వీరయ్యను మించిన స్క్రిప్ట్ తో కాంబో ముందుకు కదులుతోందన్నది టాక్. మెగాస్టారే కాదు, ఏప్రిల్ నుంచి సెట్ చేంజ్ అంటున్నారు ప్రభాస్. ది రాజాసాబ్ రిజల్ట్ ని పక్కనపెట్టేసి చకచకా మిగిలిన పనులు చేసుకుంటున్నారు డార్లింగ్. ఆల్రెడీ ఫౌజీ, స్పిరిట్ షూట్స్ సైమల్‌టైనియస్‌గా జరుగుతున్నాయి. మరి, మీరు మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి. నో పోర్షన్ చేసేస్తే వీయఫ్ ఎక్స్ మొదలుపెట్టేస్తారుగా అంటూ కల్కి మేకర్స్ ని కూడా కన్సిడర్ చేశారట డార్లింగ్. సో, ఏప్రిల్ నుంచి కల్కి సీక్వెల్ షూట్‌లో పాల్గొనబోతున్నారు. అందరి సంగతీ సరే, మా పవర్‌స్టార్ గురించి కూడా చెప్పమంటున్నారు అభిమానులు. సురేందర్ రెడ్డి సినిమా ఈ సమ్మర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నారంతా. కానీ, ఇప్పుడు దీని గురించి మేకర్స్ చెప్పేదాకా లెట్స్ వెయిట్ అండ్ సీ అనే టాక్స్ నడుస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!
పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు