ఫ్లాప్ వస్తే గానీ హీరోలు ప్లాన్ మార్చరా
వరుస పరాజయాల తర్వాత తెలుగు హీరోలు తమ సినిమా ఎంపికలో గణనీయమైన మార్పులు చేస్తున్నారు. ఫ్లాప్‌ల నుండి పాఠాలు నేర్చుకొని కొందరు కొత్త కథలను ఎంచుకుంటుంటే, మరికొందరు హిట్ల కోసం తమ పంథాను మారుస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ, శర్వానంద్, నితిన్, రామ్ వంటి హీరోలు ప్రస్తుతం తమ కెరీర్‌కు మలుపునిచ్చే ప్రాజెక్టులను ఎంచుకుంటూ మార్పు వైపు అడుగులు వేస్తున్నారు.
స్వీయ అనుభవాన్ని మించిన గుణపాఠం మరోటి ఏముంటుంది చెప్పండి..? మన హీరోలకు ఇదే జరిగిందిప్పుడు. వరసగా ఫ్లాప్స్ వస్తే కానీ లోపల్నించి మార్పు రాలేదు. కొందరు కొత్తదనం కోసం ఛేంజోవర్ కోరుకుంటే.. ఫ్లాప్స్ భయంతో మరికొందరు మార్పు వైపు అడుగులేస్తున్నారు. మరి అలా మారిపోతున్న ఆ హీరోలెవరు..? వాళ్ల సినిమాలేంటో చూద్దామా..? డిజే టిల్లుతో స్టార్ బాయ్ అనిపించుకున్న సిద్ధూ జొన్నలగడ్డ.. ఆ తర్వాత వరసగా జాక్, తెలుసు కదాతో రేసులో వెనకబడిపోయారు. అందుకే బ్యాక్ టూ రూట్స్ అంటూ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ RSJ స్వరూప్‌తో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో సినిమాకు ఓకే చెప్పారు సిద్దూ. సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ ప్రాజెక్ట్ లాక్ అయిపోయింది. సిద్ధూ ఇమ్మీడియట్ సినిమా ఇదే. శర్వానంద్ కూడా వరస ఫ్లాపుల తర్వాత తనకి బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ జోన్‌లోకి వచ్చారు.. సంక్రాంతికి నారినారి నడుమ మురారితో హిట్ కొట్టిన ఈయన.. మొన్న బైకర్‌తో ఓకే అనిపించారు. నెక్ట్స్ భోగితో ఆగస్ట్ 28న సిద్ధం అవుతున్నారు. ఇక కొన్నేళ్లుగా ఫ్లాపుల్లోనే ఉన్న నితిన్.. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో కొత్త దర్శకులతో ఓ సినిమా ఓకే చేసారు. క్యూట్ లవ్ స్టోరీగా ఇది వస్తుంది. వరసగా మాస్ సినిమాలు చేసి ఫ్లాపులతో పాటు విమర్శలు మూట గట్టుకున్న రామ్.. రీ ఫ్రెషింగ్‌గా ఆంధ్రా కింగ్ తాలూకతో వచ్చారు. ఈ సినిమాకు డబ్బులు రాకపోయినా మంచి పేరొచ్చింది. నెక్ట్స్ కూడా లవ్ స్టోరీ చేయాలని చూస్తున్నారు. విశ్వక్ సేన్ కూడా మాస్ వదిలేసి అనుదీప్‌తో ఫంకీ చేసారు కానీ కుదర్లేదు.. దాంతో మళ్లీ కల్ట్ అంటూ మాస్ వైపే వెళ్తున్నారు. మొత్తానికి మన హీరోలను ఫ్లాప్స్ బాగానే మార్చేసాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
CM Vijay: ‘వావ్’ అనిపించిన సీఎం విజయ్ తొలి ప్రసంగం
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !