ఆఫర్స్ ఉన్నా హాట్ ఫోటోషూట్స్ ఆగట్లేదు.. ట్రెండింగ్‌లో ఉండేందుకు హీరోయిన్ల గ్లామర్ గేమ్

Updated on: May 22, 2026 | 4:33 PM

టాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు సినిమాలతో పాటు గ్లామరస్ ఫోటోషూట్స్‌తోనూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. రితికా నాయక్, నభా నటేష్, రాశీ ఖన్నా, రుక్మిణి వసంత్ వంటి భామలు అవకాశాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుత పోటీలో నిరంతరం లైమ్‌లైట్‌లో ఉండేందుకు ఈ గ్లామర్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

ఉంటే సినిమాలతో బిజీ.. లేదంటే ఫోటోషూట్స్‌తో బిజీ.. కొందరు మిడ్ రేంజ్ హీరోయిన్లు ఫాలో అవుతున్న పద్దతిదే. అవకాశాల కోసం అందాలు ఆరబోస్తే ఓకే కానీ.. ఆఫర్స్ చేతిలో ఉన్నా హాట్ షో చేస్తూ ట్రెండ్ అవుతున్నారు కొందరు బ్యూటీస్. ఇప్పుడున్న పోటీలో గ్యాప్ ఇస్తే మరిచిపోతారు. అందుకే అక్కడ స్పేస్ లేకపోయినా గ్లామర్ స్ట్రోక్ ఇస్తున్నారు వాళ్లు. మరి ఆ భామలెవరో చూద్దామా..? మిరాయ్‌లో వైబ్ ఉంది బేబీ అంటూ అందర్నీ మాయ చేసిన రితికా నాయక్ గుర్తుందిగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సంచలనమిప్పుడు. ఓవైపు వరుణ్ తేజ్‌తో కొరియన్ కనకరాజు, తేజ సజ్జాతో మిరాయ్ 2 చేస్తూనే.. హాట్ ఫోటోషూట్స్‌తో మాయ చేస్తున్నారు. ఈమె లేటెస్ట్ ఫోటోషూట్ బాగా ట్రెండ్ అవుతుందిప్పుడు. చూస్తుంటే ఆఫర్స్ కోసం గ్లామర్ గేర్ మార్చినట్లే అనిపిస్తుంది. నభా నటేష్ కూడా అంతే.. ఈమె ముందు నుంచి సినిమాలతో పాటు ఫోటోషూట్స్‌ను సమానంగా చూస్తున్నారు. ప్రస్తుతం స్వయంభు, నాగబంధం లాంటి ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నా.. రిలీజ్‌కు ఇంకా టైమ్ పట్టేలా ఉంది. ఆ గ్యాప్ కూడా ఇవ్వడమెందుకని హాయిగా హాట్ పోటోషూట్స్ చేస్తున్నారు నభా. ఆఫర్స్ ఉన్నా, లేకపోయినా ఈమె ఆయుధం సోషల్ మీడియానే..! రాశీ ఖన్నాకు ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ద షాకే ఇచ్చాడు.. దాంతో అమ్మడి ఫోకస్ అంతా ఫోటోషూట్స్ వైపు మళ్లిందిప్పుడు. తెలుగులో ఆఫర్స్ లేకపోయినా.. తమిళం, హిందీలో బిజీగా ఉన్నారీమే. రుక్మిణి వసంత్ సైతం డ్రాగన్‌తో బిజీగా ఉంటూనే.. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆఫర్స్ ఉన్నా.. ట్రెండింగ్‌లో ఉండటానికి ఫోటోషూట్స్‌నే నమ్ముకుంటున్నారు హీరోయిన్లు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: జస్ట్ మిస్.. లేదంటే.. వీర భద్రుడిగా బన్నీ రెచ్చిపోయేవాడే

Ananya Nagalla: మూడేళ్లు బ్రేకప్ బాధతోనే బతికా.. శాడ్ బ్రేకప్ స్టోరీ

Jayam Ravi: నెలకు 40 లక్షలు ఇవ్వాల్సిందే! భార్య డిమాండ్ విని.. షాక్‌లో స్టార్‌ హీరో!

Peddi: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..! భారీ యాక్షన్‌కు సిద్ధమైన మేకర్స్

Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్

Follow Us