TOP 9 ET News: చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు | కృష్ణ అస్థికల నిమజ్జనంలో మహేష్‌ బాబు

|

Nov 21, 2022 | 7:15 PM

మెగాస్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. నవంబర్ 23న సాయంత్రం 4గంటల ఐదు నిమిషాలకు ఈ సినిమా నుంచి బాస్ పార్టీ లిరికల్ సాంగ్‌ రిలీజ్ అవుతోంది.

మెగాస్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. నవంబర్ 23న సాయంత్రం 4గంటల ఐదు నిమిషాలకు ఈ సినిమా నుంచి బాస్ పార్టీ లిరికల్ సాంగ్‌ రిలీజ్ అవుతోంది. ఇక ఇదే విషయాన్ని తాజాగా తమ సోషల్ మీడియా హ్యాండిలింగ్‌లలో అనౌన్స్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఇక టాలీవుడ్ ఫస్ట్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కుతున్న హనుమాన్ మూవీ నుంచి టీజర్ వచ్చేసింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా హీరోగా చేస్తున్న ఈ మూవీ టీజర్ ఎట్ ప్రజెంట్ అందర్నీ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరి హర వీర మల్లు సినిమా షూట్ నుంచి బయటికి వచ్చిన పవన్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మెగా, పవర్ ఫ్యాన్స్ షేరింగ్ తో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి.

Published on: Nov 21, 2022 07:15 PM