పెళ్లైన ఆరు నెలల తర్వాత.. సడెన్ షాకిచ్చిన టాలీవుడ్ హీరో…

Updated on: Aug 17, 2025 | 1:44 PM

ఇటీవ‌ల టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ‘కేరింత’ ఫేమ్, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్‌ దుద్దుంపూడి కూడా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ భావన అనే అమ్మాయితో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టాడు. అయితే గతేడాది ఆగస్టులోనే నిశ్చితార్థం చేసుకున్నాడు విశ్వంత్.

ఈ ఏడాది సరిగ్గా ప్రేమికుల దినోత్సవం రోజునే అంటే ఫిబ్రవరి 14న ఇద్దరూ కలిసి పెళ్లిపీటలెక్కారు. అయితే నిన్నటివరకు పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచాడు విశ్వంత్. ఇప్పుడు తన పెళ్లయి ఆరు నెలలు అవుతుండడంతో పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ ఫోటోలు చూసిన వాళ్లు షాకవుతున్నారు. విశ్వంత్ తన పెళ్లి ఫోటోలను షేర్ చేయడమే కాదు.. సినిమా స్టైల్లో ఆ ఫోటో కింద నాలుగు ముక్కులు రాసుకొచ్చాడు ఈ హీరో. భావన & విశ్వంత్‌.. ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే చూపులోనే ఓ రకమైన ప్రశాంతత.. నువ్వు నాకెప్పటినుంచో తెలుసన్న భావన.. ఇద్దరి చిరునవ్వులు, మనసులు సహజంగానే కలిసిపోయాయి.. అని ఈ ఫొటోలకు ఒక క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చాడు విశ్వంత్. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విశ్వంత్- భావన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతా నా కర్మ…! అందుకే నాకు ఇన్ని బాధలు.. అమర్‌ దీప్ ఎమోషనల్!