టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారిన హీరోయిన్ల వేట

Edited By:

Updated on: Aug 12, 2026 | 12:15 PM

టాలీవుడ్‌లో స్టార్ హీరోల పాన్-ఇండియా సినిమాలకు హీరోయిన్ల ఎంపిక పెద్ద సవాల్‌గా మారింది. గ్లోబల్ అప్పీల్ కోసం మేకర్స్ బాలీవుడ్ భామల వైపు చూస్తున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల రాబోయే ప్రాజెక్టులలో శ్రద్ధా కపూర్, కియారా అద్వానీ, కృతి సనన్, సాయి పల్లవి, ఆలియా భట్ వంటి తారల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఆసక్తికరమైన పరిణామం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు హీరోయిన్ల ఎంపిక మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో కథానాయికల కోసం డైరెక్టర్లు, నిర్మాతలు తీవ్రంగా కష్టపడుతున్నారు. గతంలో ఒకే హీరోయిన్‌ను పునరావృతం చేసిన మేకర్స్ కూడా ఇప్పుడు గ్లోబల్ అప్పీల్ కోసం బాలీవుడ్ భామల వైపు చూస్తున్నారు. ఈ ధోరణి టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీస్తోంది.ఇప్పటికే సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే AA23 సినిమాకు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న గాడ్ ఆఫ్ వార్ చిత్రంలో కియారా అద్వానీ పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, కియారా సౌత్ రికార్డును దృష్టిలో పెట్టుకొని మరో ఆప్షన్ వెళ్లడం బెటర్ అని ఎన్టీఆర్ అభిమానులు సూచిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్ సి 17కు కృతి సనన్ పేరు వినిపిస్తుండగా, ప్రభాస్ కల్కి 2898 AD సీక్వెల్‌కు సాయి పల్లవి, ఆలియా భట్ పేర్లు చర్చలో ఉన్నాయి. ఈ వార్తలపై మేకర్స్ అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us