అచ్చ తెలుగు టైటిల్స్.. అదిరిపోయాయి బాసూ

Updated on: Dec 04, 2025 | 4:55 PM

సినిమా టైటిల్స్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. రవితేజ, చిరంజీవి వంటి స్టార్ హీరోలు సంప్రదాయబద్ధమైన, వినసొంపైన అచ్చ తెలుగు టైటిల్స్‌తో రాబోతున్నారు. "భర్త మహాశయులకు విజ్ఞప్తి", "మన శంకరవరప్రసాద్ గారు" వంటి పేర్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. త్రివిక్రమ్, శర్వానంద్ చిత్రాలకు కూడా ఆసక్తికర టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

సినిమా విజయానికి టైటిల్ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అచ్చ తెలుగు టైటిల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రాలు పెరుగుతున్నాయి. ఈ టైటిల్స్ కేవలం ఆసక్తిని పెంచడమే కాకుండా, సినిమాపై సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. సరికొత్త పేర్లతో వస్తున్న సినిమాలు అంచనాలను పెంచుతున్నాయి. మాస్ రాజా రవితేజ తన సాధారణ మాస్ టైటిల్స్‌కు భిన్నంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే ఫ్యామిలీ టైటిల్‌తో సంక్రాంతికి రానున్నారు. ఈ టైటిల్ సినిమాపై కావాల్సిన పాజిటివ్ వైబ్స్‌ను అందించి, అంచనాలను పెంచింది. గతంలో “ఆడవాళ్లు మీకు జోహార్లు” వంటి ఆసక్తికరమైన టైటిల్‌తో వచ్చిన కిషోర్ తిరుమల, మరోసారి వినసొంపైన పేరుతో ఆకట్టుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సమంత పెళ్లి వెనక పెద్ద కథే ఉందిగా

Akhanda 2: బాలయ్యకు గుడ్‌ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?

‘ఆ టాలీవుడ్ హీరో భార్య నుంచి రక్షించండి’ పోలీస్‌ స్టేషన్‌కు శేఖర్ బాషా!

సామ్‌ లాగే ‘భూత శుద్ది వివాహం’ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ??

హైద్రాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ.. దానికంటే పెద్దగా ఉండబోతుందా