90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?

Edited By:

Updated on: Feb 27, 2026 | 11:01 PM

తెలంగాణ హైకోర్టు ఇటీవల సినిమా టికెట్ ధరల పెంపునకు 90 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని తీర్పునిచ్చింది. ఇది పెద్ద సినిమాల రిలీజ్ డేట్‌లకు అనుకూలం కాకపోవడంతో సమ్మర్‌లో విడుదల కానున్న ఉస్తాద్, పెద్ది వంటి చిత్రాలకు సమస్యగా మారింది. 90 రోజుల నిబంధన ఈ సినిమాలకు వర్తిస్తుందా, ప్రత్యేక అనుమతులు లభిస్తాయా, లేక ప్రస్తుత రేట్లకే విడుదలవుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పెద్ద సినిమాలు రావట్లేదని టికెట్ రేట్ల గురించి చర్చ జరగట్లేదు కానీ.. తెలంగాణలో రేట్లు పెంచుకోవాలంటే 90 రోజుల ముందు అప్లై చేసుకోవాలని ఆ మధ్య కోర్టు టైమ్ బాంబ్ పేల్చింది. ఇప్పటికీ అదే మాట మీదున్నారా..? ఒకవేళ అదే మాట మీదుంటే సమ్మర్ సినిమాల పరిస్థితేంటి..? ఉస్తాద్, పెద్ది సినిమాలకు రేట్లు పెరగవా లేదంటే కోర్టే ఏదైనా స్పెషల్ పర్మిషన్ ఇస్తుందా..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే విడుదలకు 90 రోజులు ముందు పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిందే అని జనవరిలో హై కోర్ట్ తీర్మానించింది. అఖండ 2, రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు లాంటి పెద్ద సినిమాల రేట్ల విషయంలో సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై కోర్టు సీరియస్ అయింది.. అందుకే ఇలాంటి తీర్పు బయటికొచ్చింది. 90 రోజుల ముందే పిటిషిన్ వేసుకోవడం అనేది అసలు సాధ్యమేనా..? కోర్ట్ తీర్పు సంగతి కాసేపు అలా ఉంచితే.. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కష్టం. అవి అప్పుడున్న OTT ఖాళీలు.. థియేటర్స్ సర్దుబాటును బట్టి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఆధారపడి ఉంటాయి. అలాంటిదిప్పుడు మూన్నెళ్ల ముందే పిటిషన్ అనేది పెద్ద సమస్యే. మల్టీప్లెక్స్ రేట్లు 200 నుంచి 295 వరకు పెంచుకునే వెసలుబాటు ప్రభుత్వమే ఇచ్చింది.. అవి కాకుండా ఇంకా రేట్లు అడుగుతున్నారు నిర్మాతలు. 90 రోజుల మాట అటుంచితే.. మార్చి 26న ఉస్తాద్, ఎప్రిల్ 30న పెద్ది విడుదల కానున్నాయి. అంటే పవన్ సినిమాకు 30 రోజులు.. చరణ్ సినిమాకు 60 రోజులే టైమ్ ఉంది. మరి 90 రోజుల నిబంధనలు ఎక్కడ పోయినట్లనేది అర్థం కాని విషయం. 90 రోజుల పిటిషన్ సమ్మర్ సినిమాలకు వర్తించదా..? లేదంటే ఉన్న రేట్లతోనే ఉస్తాద్, పెద్ది, టాక్సిక్ లాంటి భారీ సినిమాలు వస్తాయా..? అదీ కాదంటే నిర్మాతలే కోర్టుకెళ్లి ఏదైనా ప్రత్యేక అనుమతులు తెచ్చుకుంటారా..? ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈ విషయంపై ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక చట్టం తెచ్చేవరకు.. నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చేవరకు టికెట్ రేట్ల రచ్చ ఆగేలా లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Court Issue Movies: కోర్టు గొడవల్లో నలిగిపోతున్న సినిమాలు

తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు

అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే

అర్థరాత్రి ‌రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే

Published on: Feb 27, 2026 11:00 PM
Follow Us