‘తనొక ఉడుత’ విజయ్‌కు వ్యతిరేకంగా నటి ప్రచారం

Updated on: Apr 17, 2026 | 6:52 PM

తమిళనాడు ఎన్నికల ముందు విజయ్‌కు వ్యతిరేకంగా నటి జూలీ నిరసన చేపట్టింది. డీఎంకేకు ఓటు వేయాలని పిలుపునిస్తూ, విజయ్‌ను ఉడుతతో పోలుస్తూ మెరీనా బీచ్‌లో ప్లకార్డులతో ప్రదర్శన ఇచ్చింది. అనుమతి లేకుండా నిరసన తెలిపినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేసి, క్షమాపణ లేఖ రాయించుకుని విడుదల చేశారు. ఈ ఘటన కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తమిళనాడులో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఓ పక్క విజయ్‌ తన ప్రచార పర్వాన్ని పరిగెత్తిస్తుంటే.. మరో పక్క ఆయనకు వ్యతిరేకంగా ఓ నటి సింగిల్‌గా తన పోరాటాన్ని షురూ చేసింది. విజయ్‌ ను ఉడుతతో పోలుస్తూ.. అందరూ డీఎమ్‌కేకే ఓటు వేయాలంటూ ప్లకార్డు పట్టుకుని బీచ్‌ రోడ్‌లో ప్రత్యక్షమైంది. ఈ కారణంగా కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది నటి జూలీ. తమిళనాడులో జల్లికట్టు ఆందోళన ద్వారా పాపులర్ అయిన బుల్లి తెర నటి జూలీ, తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. చెన్నై మెరీనా బీచ్‌లో అనుమతి లేకుండా రీసెంట్‌గా నిరసన తెలిపారు. ఇప్పటికే పెరంబూరు నియోజకవర్గంలో విజయ్‌ను విమర్శిస్తూ ప్రచారం చేసిన జూలీ తాజాగా మెరీనా ఔవయ్యార్‌ విగ్రహం దగ్గర తన మద్దతుదారులతో కలిసి ఆకస్మికంగా నిరసనలో పాల్గొన్నారు. ఒక చేతిలో డీఎంకేకు ఓటు వేయండి అనే బ్యానర్‌ను, మరో చేతిలో విజయ్‌ను ఉద్దేశించి ఉడుత బొమ్మ వేసి దానిపై క్రాస్‌ గుర్తుతో కొట్టేసిన బ్యానర్‌ను పట్టుకుని నినాదాలు చేశారు. తమిళగ వెట్రికళగం ద్వారా మహిళలకు రక్షణ లేదు అనే వాక్యం ఉన్న ప్లకార్డును జూలీ పట్టుకోవడం విజయ్‌ అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో నిరసన తెలిపిన జూలీతో సహా నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల సమయంలో సరైన అనుమతి లేకుండా ప్రచారం చేయకూడదని సూచించిన పోలీసులు, ఆమె నుంచి క్షమాపణ లేఖ రాయించుకుని విడుదల చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anakapalli: అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కుకుంటూ ఎక్కడికి వెళ్లాడో తెలుసా ?? చివరికి

బావిలో పడ్డ మృగరాజు.. ఎలా కాపాడారంటే..

జీతం 9 రూపాయలే పెంచారు.. ఓ టెకీ ఆవేదన

ఇంట్లో తిట్టారని వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడిని.. పాతికేళ్లకు ఫేస్‌బుక్‌ కలిపింది

Follow Us