గుడ్ న్యూస్.. రెట్రో OTT రిలీజ్ డేట్ వచ్చేసింది
మేడే కానుకగా థియేటర్లలో రిలీజైన సూర్య రెట్రో సినిమా.. మొదట మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కానీ క్రమ క్రమంగా టాక్ మారిపోయింది. వసూళ్లు కూడా పెరిగాయి. దీంతో ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 235 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే అంతర్లీనంగా ప్రేమ కథ కూడా ఉండడంతో మూవీ లవర్స్ కు ఈ చిత్రం బాగా నచ్చేసింది.
అయితే అంతలా అందరికీ నచ్చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. రెట్రో సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 31 నుంచి ఈ యాక్షన్ థ్రిల్లర్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా తమ సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఇక కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. 2డీ ఎంటర్‌టైన్‍మెంట్స్, స్టోన్‍బీచ్ ఫిల్మ్స్ బ్యానర్ల పై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. 1990ల బ్యాక్‍డ్రాప్ లో రొమాంటిక్ యాక్షన్ మూవీగా రెట్రో ను తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. యాక్షన్ సినిమాలు, అలాగే సూర్య మూవీస్ ను ఇష్టపడే వారు రెట్రోపై ఒక లుక్కేసుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమరన్ మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..! ఏం చేద్దాం.. విధి!
ప్రభాస్ బోర్ అనుకున్నా కానీ.. వామ్మో..! రాజాసాబ్‌పై మాళవిక నాటీ కామెంట్స్