వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో

Updated on: Nov 30, 2025 | 11:57 AM

దర్శక ధీరుడు రాజ మౌళి వారణాసి చిత్రం కోసం వినూత్న శైలిని అనుసరిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ గ్లోబల్ మూవీ షూటింగ్‌ను ఆయన గత చిత్రాల కంటే వేగంగా, ఒకేసారి రెండు, మూడు సెట్లలో నిర్వహిస్తున్నారు. 2026 పోస్ట్ ప్రొడక్షన్ కోసం, 2027 సమ్మర్ విడుదలకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ స్పీడ్ ఇండస్ట్రీని ఆశ్చర్య పరుస్తోంది.

దర్శకధీరుడు రాజమౌళి తన తాజా గ్లోబల్ చిత్రం వారణాసి మేకింగ్ విషయంలో పూర్తిగా కొత్త పంథాను అనుసరిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి, రాజమౌళి మొదటి నుంచీ డిఫరెంట్‌గా ఆలోచిస్తూ, షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.గత చిత్రాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న రాజమౌళి, వారణాసి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో షెడ్యూల్స్‌ మధ్య భారీ విరామాలు ఉండేవి. అయితే ఇప్పుడు అలాంటి గ్యాప్‌లకు తావు లేకుండా, ఒకేసారి రెండు లేదా మూడు సెట్స్‌లో ప్యారలల్‌గా షూటింగ్ పనులు నిర్వహిస్తున్నారు.