స్టోరీ డిమాండ్… షేప్ మారుస్తున్న హీరోలు

Edited By:

Updated on: Apr 02, 2026 | 8:49 PM

సినిమా పాత్రల కోసం సౌత్ హీరోలు రామ్ చరణ్, శర్వానంద్, జూనియర్ ఎన్టీఆర్ పడుతున్న కష్టం అద్భుతం. కెమెరా ముందు హీరోయిజం కాదు, కెమెరా వెనుక తీవ్రమైన వర్కవుట్లతో ఫిజికల్ మేకోవర్ చేసుకుంటున్నారు. వారి అంకితభావం, ప్యాషన్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇది కేవలం జిమ్మిక్కులు కాదు, సినిమా పట్ల వారి నిబద్ధతకు నిదర్శనం.

హీరోలంటే కెమెా ముందు హీరోయిజాన్ని చూపించేసి, జిమ్మిక్కులు చేసేసి సైలెంట్ గా పక్కకు తప్పుకోవడం లేదు. కెమెరా ముందు చేసే ఫీట్స్ కోసం కెమెరా వెనుక రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. వాళ్లు మేకోవర్ కోసం పడుతున్న కష్టం చూసిన వారు, సినిమాలు ఎలాగైనా క్లిక్ కావాలని మనసారా కోరుకుంటున్నారు. పెద్ది నుంచి రామ్‌చరణ్‌ బర్త్ డే కి రిలీజ్‌ అయిన వీడియో చూశారా? ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్‌ కూడా గ్రాఫిక్స్ యాడెడ్‌ లేదన్నది మేకర్స్ సగర్వంగా చెబుతున్న మాట. రామ్‌చరణ్‌ పడ్డ కష్టానికి ప్రతి ఫలం ఇది అంటూ హ్యాపీగా షేర్‌ చేసుకున్నారు మేకర్స్. ఎంత కమిట్‌మెంట్‌ ఉంటే ఈ రేంజ్‌ ట్రాన్స్ ఫర్మేషన్‌ వస్తుందో కదా అని విస్తుపోతున్నారు జనాలు. సౌత్‌ ఇండియాలో రీసెంట్‌ టైమ్స్ లో ఇంత వర్కవుట్‌ చేసిన వారెవరని ఆరా తీస్తున్నారు. రామ్‌చరణ్‌ గురించే కాదు, ఆయన స్నేహితుడు శర్వానంద్‌ గురించి కూడా ఈ రకమైన మాటలే సాగుతున్నాయి. బైకర్‌ కోసం శర్వానంద్‌ చేసిన వర్కవుట్లు, ఫిజికల్‌ ఛేంజ్‌ అందరినీ ఫిదా చేస్తోంది. ఒక సినిమా మీద ఇంత ప్యాషన్‌ ఉంటుందా? మరీ ఇంతలా కష్టపడతారా? అంటూ మాట్లాడుకునేలా చేస్తోంది. రీసెంట్‌గా తారక్‌ లుక్స్ చూసిన వారు కూడా నీల్‌ సినిమా కోసం తారక్‌ ఇంతలా ఎందుకు మారారని మాట్లాడుకుంటున్నారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌లోనూ, కేరక్టర్‌ కి కావాల్సిన షేప్‌లోకి మారడంలోనూ మన హీరోలు ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదని ఇష్టంగా చెప్పుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు

ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే

Published on: Apr 02, 2026 08:49 PM
Follow Us