శివ కార్తికేయన్ ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ అన్నింటికీ రిజెల్ట్ సాటిఫ్ గానే వస్తుందా లేదా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. అమరన్ కథ– నిజమైన కథ..! మేజర్ ముకుందన్ జీవితంలోని సంఘటనల ఆధారంగా చేసుకుని అల్లిన కథ. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముకుంద్ వరదరాజన్ 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్ గా వ్యవహరిస్తూ మృత్యువాత పడ్డారు. ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ తమ పరిచయం నుంచి అశోక చక్ర గ్యాలరీ అవార్డు అందుకునే వరకు జరిగిన కథను ప్రేక్షకులకు వివరించేలా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియ స్వామి. అందరికీ తెలిసినట్టే.. ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్, ఇందు పాత్రలో సాయి పల్లవి నటించారు. 2004లో వీరి పరిచయం ఎలా జరిగింది? ఎలా ప్రేమలో పడ్డారు? ప్రేమలో పడిన తర్వాత వివాహం చేసుకునేందుకు పెద్దలను ఒప్పించడానికి ఎంత కష్టపడ్డారు? ముకుంద్ చీతా వింగ్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి విజయాలు సాధించాడు? కాశ్మీర్‌లో.. అల్తాఫ్ బాబా, ఆసిఫ్ ఘని వంటి వాళ్లను ఎలా అరికట్టగలిగాడు? చివరికి ఎలా పోరాడుతూ మృత్యువాత పడ్డాడు లాంటి విషయాలు బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. నిజానికి అమరన్.. మిలిటరీ సోల్జర్ ముకుంద్ బయోపిక్. కానీ ఈ మూవీలో దేశభక్తి మీద ప్రధానంగా ఫోకస్ చేయలేదు డైరెక్టర్ పెరియస్వామి. దానికి బదులు అతని వ్యక్తిగత జీవితాన్ని ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశాడు. అందులో దర్శకుడు సఫలం అయ్యాడు. ఎంత మిలిటరీ సోల్జర్ అయినా సరే అతను కూడా ఒక మనిషే. అతనికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, తల్లి తండ్రులు అలాగే తోడ పుట్టిన వారు.. వారి బాధ్యతలు.. భార్య, పిల్లలు ఉంటారు. దేశం మీద ప్రేమతో సరిహద్దులలో కంటికి కనిపించే కనిపించని శత్రువులతో పోరాడుతూ ఎలాంటి ఇబ్బందులు పడతారు? కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఎంత మనోవేదన అనుభవిస్తారు? లాంటి విషయాలను కళ్ళకు కట్టినట్లు ప్రేక్షకుల మనసులను మెలిపెట్టే విధంగా స్క్రీన్ మీద చూపెట్టాడు దర్శకుడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోవా రైల్లో బుస్.. బుస్..సెకెండ్ ఏసీలో కర్టెన్ తీసి చూస్తే షాక్..
లక్కీ భాస్కర్.. హిట్టా ?? ఫట్టా ?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి