Siri Hanumanth: ఇన్‌స్టా సబ్‌ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!

Updated on: May 11, 2026 | 3:59 PM

బుల్లితెర బ్యూటీలు ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌తో భారీగా సంపాదిస్తున్నారు. సిరి హన్మంతు కూడా ఈ జాబితాలో చేరి, నెలకు ₹399తో తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం 422 మంది సబ్‌స్క్రైబర్‌లతో నెలకు సుమారు ₹1.68 లక్షలు ఆర్జిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. విష్ణు ప్రియ, అనన్య నాగెళ్ళ బాటలో నడుస్తూ, సిరి తన అభిమానులకు మరింత చేరువవుతున్నారు.

ఇప్పుడు మన బుల్లితెర బ్యూటీలందరూ ఇన్‌స్టా సబ్‌ స్క్రిప్షన్‌ మాయలోకి జారుకుంటున్నారు. సబ్‌ స్క్రిప్షన్‌ ద్వారా వచ్చే డబ్బు వల్లో.. లేక నేరుగా తమ టార్గెట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ కు దగ్గరవ్వొచ్చు అనే ఆలోచన పెట్టుకుంటున్నారో తెలీదు కానీ.. ఇన్ స్టా వేదికగా పెయిడ్ సబ్ స్క్రిప్షన్‌ను స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫీల్డ్‌ లో విష్ణు ప్రియ టాప్‌ లో ఉండగా… అనన్య నాగెళ్ల రీసెంట్‌ గా జాయిన్ అయ్యారు. ఇక ఇప్పుడు వీరి బాటలోనే సబ్‌ స్క్రిప్షన్‌ను మొదలెట్టారు సిరి హన్మంతు. షార్ట్ ఫిల్మ్స్‌, రీల్స్‌తో.. మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరి .. ఆ తర్వాత బిగ్ బాస్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ వేదికతో మంచి ఫేమ్‌ సంపాదించేసి.. ఇప్పుడు సినిమాలు చేస్తూ.. సెలబ్రెటీ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గాఉంటూ.. తన ఫోటోలతో.. వీడియోలతో.. యాక్టివిటీతో.. తన ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటారు సిరి. ప్రస్తుతం ఇన్‌ స్టాలో 973k ఫాలోవర్స్‌ ఉన్న సిరి హన్మంతు.. రీసెంట్‌ గా పెయిడ్ సబ్ స్క్రిప్షన్‌ ను మొదలెట్టారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను చూడటానికి నెలకు 399 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మే 2026 నాటి తాజా నివేదికల ప్రకారం, సిరి హన్మంతుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం 422 మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ లెక్కన ప్రస్తుతం ఆమె నెలకు సుమారు 1,68,378 రూపాయల వరకు ఈ ఫీచర్ ద్వారా ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: బాబాయ్‌ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్

Trisha: విజయ్‌ మౌనం నాకు నచ్చదు..!

త్రిష పక్కనుంటే ఇక అంతే.. విజయ్‌ భవిష్యత్తు పై జోస్యం చెప్పిన వేణు స్వామి

కోలీవుడ్‌లో నెక్స్ట్ దళపతి ఎవరు ?? యువ హీరోలకు సవాళ్లు

Follow Us