తెలుగులో ఛాన్సులు రావడంలేదుంటూ.. స్టేజ్‌పై ఏడ్చిన హీరోయిన్

Updated on: May 24, 2025 | 2:41 PM

హీరోయిన్ గా రాణించాలి. మంచి క్రేజ్ తెచ్చుకోవాలని చాలా మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. అయితే అందరికి అదృష్టం కలిసి రాదు. అలా అదృష్టం కలిసిరాక కనుమరుగైన హీరోయిన్ చాలా మంది ఉన్నారు. అందం అభినయం ఉన్న కూడా చాలా మంది హీరోయిన్స్ అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

కొంతమంది సినిమాలు మానేసి బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. మరికొంతమంది మాత్రం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవుతున్నారు. అయితే ఓ యంగ్ హీరోయిన్ మాత్రం అదృష్టం కలిసి రాక అవకాశాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంది. అంతే కాదు తనకు అవకాశాలు ఇవ్వాలని కన్నీళ్లు కూడా పెట్టుకుంది.ఇంతకూ ఆమె ఎవరో కాదు..ఆమే శాన్వీ శ్రీవాస్తవ. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లవ్లీ సినిమాకు బీఏ జయ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శాన్వీ శ్రీవాస్తవ. తొలి సినిమాతోనే తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది. ఆతర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. సుశాంత్ అడ్డా, మంచు విష్ణు రౌడీ, మరోసారి ఆదితో ప్యార్ మే పడిపోయానే సినిమాల్లో నటించింది. కానీ అవేమి వర్కౌట్ కాలేదు. దాంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆ మధ్య అతడే శ్రీమన్నారాయణ డబ్బింగ్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సమయంలో శాన్వీ మాట్లాడుతూ తెలుగులో అవకాశాలు రావడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఎందుకు ఛాన్స్ లు రాలేదో అర్ధం కావడం లేదు అని స్టేజ్ పైనే ఏడ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా హీరో,హీరోయిన్లకు సపరేట్‌ రూం ఇచ్చి డ్రగ్స్ ఇస్తున్నాం.. లేడీ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

సబ్బు తెచ్చిన తంట.. చిక్కుల్లో తమన్నా! కన్నడ ప్రజలు సీరియస్

దీపిక బ్యాడ్‌లక్‌ కాస్తా.. రుక్మిణీ గుడ్‌లక్‌ అయిందిగా.. ప్రభాస్ పక్కన బంపర్ ఆఫర్

అమర జవాన్ కుంటుంబానికి ఆర్థిక సాయం.. చిన్న హీరోయిన్ పెద్ద మనసు !!