Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ కన్నుమూత.. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు..
సీనియర్ హీరో కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపుతున్నారు సత్యనారాయణ. నిన్న రాత్రి వరకు ఆయనకు ఇంటిదగ్గరే చికిత్స అందించారు వైద్యులు. కొద్దిసేపటి క్రితమే ఆయన కన్ను మూశారు.
సీనియర్ హీరో ఎన్టీఆర్ కు డూప్ గా నటించారు సత్యనారాయణ. కామెడీ విలన్ గాను మెప్పించారు సత్యనారాయణ. తన సినీ కెరీర్‌లో కైకాల సత్యనారాయణ ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రకరకాల పాత్రల్లో మెప్పించాడు. వయోభారంతో కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కైకాల సత్యనారాయణ ఒకప్పుడు రమా ఫిలింస్ అనే బ్యానర్‌తో సినిమాలను కూడా నిర్మించారు. కైకాల సత్యనారాయణ తర్వాత ఆయన వారసుడు.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన శాండిల్‌వుడ్‌లో నిర్మాణరంగంలో కూడా ఉన్నారు.
Published on: Dec 23, 2022 08:19 AM