Samyuktha: ధనుష్ గురించి సంయుక్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Edited By:

Updated on: Apr 07, 2026 | 9:02 PM

సంయుక్త మీనన్ తన కెరీర్‌లో వేగంగా ఎదుగుతున్నారు. 'మీనన్' అనే పేరును ఇష్టపడని ఆమె, 'విరూపాక్ష' వంటి చిత్రాలతో నటిగా తన సత్తా చాటారు. 'నారీ నారీ నడుమ మురారి'తో మెచ్యూర్డ్ నటనతో ప్రశంసలు పొందారు. ధనుష్‌తో మళ్లీ కలిసి పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. ధనుష్‌ను బెస్ట్ కో-స్టార్‌గా పేర్కొంటూ, అతని అంకితభావం, ప్రవర్తన తనకెంతో నచ్చుతాయని వెల్లడించారు. ఈ జంట మళ్లీ స్క్రీన్‌పై కనిపించాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

రకరకాల రీజన్స్ తో వార్తల్లో ఉండే హీరోయిన్లు చాలా మందే ఉంటారు. నేను ఎవరికీ దగ్గర కాను… ఒకవేళ అయితే వాళ్లు నాకు చాలా సన్నిహితులు.. అలాంటివారి దగ్గరే ఓపెన్‌ అవుతాను అనే కేటగిరీ కూడా ఇంకోటి ఉంటుంది. మిస్‌ సంయుక్త మీనన్‌.. సారీ.. సంయుక్త.. మీనన్‌ అని పేరు చివర తగిలించుకోవడం ఆమె ఇష్టం ఉండదు కదా.. అందుకే మిస్‌ సంయుక్త ఈ విషయం గురించి ఏమంటున్నారో.. లెట్స్ హావ్‌ ఎ లుక్‌… సంయుక్త మీనన్‌ సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుందన్న ఫీల్‌ క్రియేట్‌ అయింది జనాల్లో. స్క్రీన్‌ మీద ప్లెజెంట్‌గా కనిపించడమే కాదు, విరూపాక్ష లాంటి సినిమాల్లో పెర్ఫార్మెన్స్ తోనూ వావ్‌ అనిపించగలనని ప్రూవ్‌ చేసుకున్నారు సంయుక్త. ఈ ఏడాది ఆమెకు చాలా పాజిటివ్‌గా స్టార్ట్ అయింది. నారీ నారీ నడుమ మురారి చిత్రంలో ఆమె చేసిన కేరక్టర్‌కి ది బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. మెచ్యూర్డ్ గా కనిపించారంటూ అప్లాజ్‌ అందుకున్నారు మిస్‌ మీనన్‌. ఇప్పుడు మన సినిమాలతో పాటు నార్త్ లోనూ బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సందర్భంలోనే ఆమె నచ్చిన కోస్టార్‌ గురించి మనసులోని మాటలను షేర్‌ చేసుకున్నారు. తాను ఇప్పటిదాకా ఎంతో మంది హీరోలతో కలిసి నటించానని, వారిలో మళ్లీ వర్క్ చేయాలనుకుంటున్నవారిలో ధనుష్‌ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారని చెప్పారు సంయుక్త. కెమెరా ముందు నిలుచున్నప్పుడు తన 100 పర్సెంట్‌ ఇవ్వడం అంటే ఏంటో ధనుష్‌కి చాలా బాగా తెలుసన్నారు. ది బెస్ట్ పెర్ఫార్మర్‌ అయినా సెట్లో ఎక్కువగా మాట్లాడరని, ఆయన యాటిట్యూడ్‌ కూడా తనకు చాలా ఇష్టమని తెలిపారు సంయు… సార్‌తో మేజిక్‌ చేసిన ఈ జంట మళ్లీ ఎప్పుడు సందడి చేస్తుందో చూడ్డానికి జనాలు కూడా వెయిటింగ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Liquor: మందుబాబులకు షాక్.. పెరగనున్న మద్యం ధరలు

తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Biker Collection: బాక్సాఫీస్‌ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్

Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట

Follow Us